అమెరికాలో చలికాలం వచ్చేసింది.. COVID-19 రికార్డులు బ్రేక్ చేస్తుంది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

COVID-19 రికార్డు రేంజ్ లో పెరిగిపోతుంది. అమెరికాలో వాతావరణం మారి చలికాలం రావడంతో తొమ్మిది రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. upper Midwest, West ప్రాంతాల్లో వణుకు పుట్టిస్తున్న వాతావరణం కారణంగా ఇళ్లలో నుంచి బయటకు రావడం లేదు.

శనివారం Kentucky, Minnesota, Montana, Wisconsin నాలుగు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదై 49వేల కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ఏడు వారాలుగా ఇదే రికార్డు స్థాయి అని ఇంగ్లీష్ మీడియా విశ్లేషణలో తేలింది. Kansas, Nebraska, New Hampshire, South Dakota, Wyoming ప్రాంతాల్లో గత వారం రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.గత రెండు వారాలుగా అంతగా పెరగని ప్రాంతం New York ఒకటే. న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ దే బ్లాసియో అత్యవసరం కాని బిజినెస్ లను మూసి వేస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్ కు ప్రభుత్వం నుంచి అప్రూవల్ రావాల్సి ఉంది.

కూల్ టెంపరేచర్ వైరస్ వ్యాప్తి పెరిగేలా చేస్తుందని.. ఆరోగ్యశాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. upper Midwest ప్రాంతంలో ప్రస్తుతం 10 సెల్సియస్ టెంపరేచర్ మాత్రమే ఉంది. గత నాలుగు రోజులుగా మోంటానా.. రికార్డు స్థఆయిలో కేసులు నమోదవుతుండటంతో కొవిడ్ పేషెంట్లతో హాస్పిటల్స్ బిజీ అయిపోయాయి.North Dakota, South Dakota, Wisconsin కొత్త కేసులు అత్యధికంగా నమోదవుతుండటంతో మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని.. ప్రభుత్వం ఆంక్షలు విధించింది.

Related Tags :

Related Posts :