లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

దసరాకు ‘ఆర్ఆర్ఆర్’.. సంక్రాంతికి ‘సలార్’..

Published

on

RRR – Salaar: లాక్‌డౌన్ తర్వాత సినిమా షూటింగులు, విడుదల తేదీలు స్పీడప్ అయ్యాయి. థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నాయి. కరోనా కష్టకాలం తర్వాత థియేటర్లు తెరుచుకున్న తర్వాత ప్రేక్షకాదరణ ఏ స్థాయిలో ఉందనేది ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ప్రూవ్ చేశాయి.. ఇక తమ సినిమాలు ఒక్కొకటిగా వదలడానికి మేకర్స్ రిలీజ్ డేట్స్ లాక్ చేసుకుంటున్నారు.

అన్నీ అనుకున్నట్టు జరిగితే జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ ఈ జనవరి 8 న విడుదలయ్యేది. కానీ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఈ ఏడాది దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

RRR

రెబల్ స్టార్ ప్రభాస్, కె.జి.యఫ్. ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ‘సలార్’ ఇటీవలే ప్రారంభమైంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా పూర్తి చేసిన ప్రశాంత్.. డార్లింగ్‌కి ఉన్న ఇతర కమిట్‌మెంట్స్ దృష్ట్యా వీలైనంత త్వరగా సినిమాను పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

Salaar