లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

బాలయ్య డైలాగ్ చెప్తూ దమ్ము కొట్టిన హాట్ బ్యూటీ.. వీడియో వైరల్..

Published

on

Ashima Narwal: సోషల్ మీడియా పుణ్యమా అని డబ్ స్మాష్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. వీటిద్వారా టాలెంట్ ఉన్న చాలామందికి చక్కటి అవకాశాలు వచ్చాయి. ఇక సెటబ్రిటీలు చేసే డబ్ స్మాష్, పేరడి వీడియోలు అయితే బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా హాట్ బ్యూటీ ఆషిమా నర్వాల్ షేర్ చేసిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఆషిమా తెలుగులో ‘నాటకం’, ‘జెస్సీ’, విజయ్ సేతుపతి ‘కిల్లర్’ (డబ్బింగ్) వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం తమిళ్ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఆషిమా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆషిమా సూపర్ స్టైల్ గా స్మోక్ చేస్తూ నటసింహం నందమూరి బాలకృష్ణ డైలాగ్ చెబుతోంది. సాధరణంగా బాలయ్య డైలాగ్ డెలివరీ ఎంత పవర్‌ఫుల్ గా ఉంటుందో తెలిసిందే.


బాలయ్య నటించిన ‘శ్రీమన్నారాయణ’ సినిమాలో.. ‘‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్‌.. ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్‌.. ట్రబుల్ ట్రబుల్స్ యు.. ఐయామ్ నాట్ ద ట్రబుల్‌.. ఐయామ్ ద ట్రూత్’’ అనే ఒక టంగ్ ట్విస్టర్ డైలాగ్ ఉంటుంది. దాన్ని ఆషిమా తన స్టైల్లో చెప్పింది. చివర్లో ఐయామ్ ద ట్రూత్ అనడానికి ముందు సిగరెట్ నోట్లో పెట్టి ఒక దమ్ము లాగుతూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అయితే అదిరిపోయిందనే చెప్పాలి.

అసలు విషయం ఏంటంటే.. ఆ వీడియో కింద పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అనే హెచ్చరిక కూడా జారీ చేసింది. అయితే తను నటిస్తున్న ఓ తెలుగు సినిమాలో క్యారెక్టర్ కోసమే ఇలా సిగరెట్ తాగడం ప్రాక్టీస్ చేస్తున్నట్లు తెలిపింది ఆషిమా.


‘‘మనమంతా భూమాతను ఇబ్బంది పెడుతున్నాం, అందుకే భూమాత తిరిగి మనల్ని ఇబ్బంది పెడుతోంది.. కాబట్టి భూమిని ఇబ్బందిపెట్టవద్దు, భూమి అనేది ట్రబుల్ కాదు, అదే అసలైన నిజం..’’ అని చెబుతూ హైదరాబాద్ వరద భీభత్సాన్ని ఉద్ధేశిస్తూ ఈ కామెంట్స్ చేసిందామె.

ఇక తాను సిగరెట్ తాగడం చూసి షాకవుతున్నవారిని ఉద్ధేశిస్తూ.. స్కూటర్లు, ఫ్యాక్టరీల పొగతో వాతావరణం కలుషితమవ్వడం గురించి మాట్లాడుతూ.. ‘‘దాని గురించి ఎందుకు ఎవరూ షాకవ్వట్లేదు. అదే మిమల్ని ఎక్కువగా షాక్ చేయాల్సిన విషయం’’ అంటూ వాతావరణాన్ని మనుషులు ఎలా కలుషితం చేస్తున్నారో చెప్పుకొచ్చింది హాట్ బ్యూటీ ఆషిమా నర్వాల్.

https://www.instagram.com/p/CGUtCS9Hu7H/?utm_source=ig_web_copy_link

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *