Ashok Galla Debut Film launch

అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న సినిమా ప్రారంభం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అశోక్ గల్లా హీరోగా తెరంగేట్రం చేస్తున్న ప్రొడక్షన్ నెం:1 చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, పద్మావతిల కుమారుడు గల్లా అశోక్ హీరోగా తెరంగేట్రం చేస్తున్న ప్రొడక్షన్ నెం:1 చిత్రం ఆదివారం ఉదయం రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గల్లా, ఘట్టమనేని కుటుంబ సభ్యులతో పాటు, పలువురు రాజకీయ నాయకులు విచ్చేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రానా దగ్గుబాటి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

సూపర్‌స్టార్ కృష్ణ మరియు గల్లా అరుణ కుమారి సమర్పణలో, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో, అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌‌మెంట్స్ బ్యానర్‌పై పద్మావతి గల్లా నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘ఇస్మార్ట్ బ్యూటీ’ నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది.. హీరో, హీరోయిన్లపై రామ్ చరణ్ క్లాప్ నిచ్చారు.. రానా కెమెరా స్విచ్ఛాన్ చేయగా, కృష్ణ దర్శకుడికి స్క్రిప్ట్ అందచేశారు.

కృష్ణ, అమల, నమ్రత, రానా, సుధీర్ బాబు, సుశాంత్, నరేష్, ఆదిశేషగిరిరావు, నన్నపనేని రాజకుమారి, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కింజారపు రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కృష్ణ మరియు మహేష్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.
సంగీతం : జిబ్రాన్, కెమెరా : రిచర్డ్ ప్రసాద్, ఎడిటింగ్ : ప్రవీణ్, ఆర్ట్ : రామాంజనేయులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ రావిపాటి.

Related Posts