లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

మహేష్ మేనల్లుడు వస్తున్నాడోచ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు..

Published

on

Ashok Galla To Debut - Grand launch on November 10th

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు గల్లా అశోక్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, పద్మావతిల కుమారుడు గల్లా అశోక్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. గతేడాది అశోక్ హీరోగా ఓ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుని అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది.. చిన్న విరామం తీసుకుని బాగా మేకోవర్ అయ్యాడు అశోక్.. అతని లేటెస్ట్ స్టిల్స్ చూస్తే హీరోగా పర్ఫెక్ట్ అనిపిస్తుంది.

‘భ‌లే మంచి రోజు’, ‘శ‌మంత‌క మ‌ణి’, ‘దేవ‌దాస్’ చిత్రాల‌తో ప్ర‌శంస‌లు దక్కించుకున్న యువ ద‌ర్శ‌కుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ తొలి సినిమా చేయనున్నాడు. అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల పదో తేదీన రామానాయుడు స్టూడియోస్‌లో అత్యంత ఘనంగా జరుగనున్న సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకాబోతున్నారు.

Read Also : మలయాళంలో ‘అల వైకుంఠపురములో’ – ఫ్యాన్స్ హంగామా షురూ!

కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వీకే నరేష్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీత దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.. హీరోయిన్, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *