లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

వైరల్‌గా మారిన అశ్విన్ – హార్దిక్ – కుల్దీప్ డ్యాన్స్.. డోంట్ మిస్

Updated On - 12:59 pm, Sun, 21 February 21

Ravichandran Ashwin: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తన లవ్.. అభిమానమైన సాంగ్ ను అతనే కాకుండా మరో ఇద్దరు టీమిండియా ప్లేయర్లతో వేయించాడు. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ లో డ్యాన్స్ స్టెప్పులేశారు. లోకేశ్ కనగరాజ్ డైరక్ట్ చేసిన మాస్టర్ మూవీలో తలపతి విజయ్ లీడ్ రోల్ లో నటించారు.

ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్ లో ఐదు వికెట్లు పడగొట్టాడు. అదే మ్యాచ్ రోజున డ్రెస్సింగ్ రూంలో డ్యాన్స్ వేస్తూ.. తీసిన వీడియోను ఇన్ స్టాలో పోస్టు చేశాడు. ఈ డ్యాన్స్ లో అశ్విన్ తో పాటు హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ లు కాలు కదిపారు. అశ్విన్ డ్యాన్స్ స్టార్ట్ చేశాక.. హార్దిక్ స్టెప్పుకు, కుల్దీప్ ఎంట్రీతో ముగిసింది.

అశ్విన్ పెట్టిన పోస్టుకు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందట. ఇక విజయ్ ఫ్యాన్స్ తో పాటు అశ్విన్ అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ వీడియోను తెగ మెచ్చేసుకుంటున్నారు.