Asin's daughter arin, who became a cooking master

వంట మాస్టర్ గా ఆసిన్ కూతురు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సినీ హీరోయిన్ ఆసిన్ పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. రాహుల్ శర్మ అనే బిజినెస్ మ్యాన్ ను వివాహం చేసుకుంది. అసిన్, రాహుల్ 2016లో పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే. వీరికి అరిన్ అనే చిన్నారి ఉంది. అరిన్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన అభిమానులను ఆసిన్ థ్రిల్ చేస్తూవుంటోంది. గతేడాది తన కూతురు పుట్టిన రోజు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఫోటోలు వైరల్ గా మారాయి. 

తాజాగా అరిన్ కిచెన్ లో వంట చేస్తున్న వీడియోలను ఆసిన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో శ్రద్ధతో కూరగాయలు (బొమ్మ వస్తువులు) కట్ చేస్తూ, వాటిని పాత్రలో వేస్తుంది. అనంతరం స్టవ్ పై పెట్టి కూర చేస్తున్నట్లుగా ఫీలైంది. కిచెన్ లో అరిన్ వంట ఫొటోలు నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇక మరో వీడియోలో పని చేసి అలసిపోయినట్లుగా కనిపించిన అరిన్ ఇంటిని కూడా శుభ్రపరిచింది. 

ఆసిన్ ..దక్షిణాదిన అగ్రహీరోల సరసన నటిస్తూ తన అందం, అభినయంతో ఎందరో అభిమానులను సొంతం చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది. తెలుగులో శివమణి, ఘర్షణ, గజిని, అమ్మనాన్న ఓ తమిళమ్మాయి వంటి పలు హిట్ చిత్రాల్లో నటించింది. తన నటనతో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. 

Related Posts