జూలో పులులకు బీఫ్ పెట్టొద్దంటోన్న అస్సాం బీజేపీ లీడర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘జూ’లో ఉండే జంతువులకు Beef పెట్టకూడదని Assam BJP లీడర్ సత్య రంజన్ బొరాహ్ అంటున్నారు. అన్ని జంతువులకు పెట్టొద్దని ప్రత్యేకించి పులులకు అస్సలు పెట్టొద్దని చెప్తున్నారు. సోమవారం యాంటీ Beef యాక్టివిస్ట్‌లు గువాహతి జూ మెయిన్ గేట్ సమీపంలో వాహనాలు నిలిపేసి బ్లాక్ చేయడానికి ప్రయత్నించారు.
పులుల కోసం Beef పట్టుకెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. జూ అధికారులు పోలీసుల సహాయంతో వారిని చెదరగొట్టారు. ఆవులను చంపటాన్ని నిషేదించాలంటూ ఆందోళనకారులు నినదించారు.

‘హిందూ సమాజంలో ఆవుకు ప్రాముఖ్యత ఇస్తామని జూలో మాంసాహార జంతువులకు ప్రభుత్వం బీఫ్ నే సప్లై చేస్తుందని వెల్లడించారు. మా అభ్యంతరం ఏంటంటే బీఫ్ మాత్రమే ఎందుకు. ఇతర జంతువుల మాంసం ఎందుకు కాదు అని బొరాహ్ ప్రశ్నలు కురిపించారు.

దాంతో పాటు ఆ బీజేపీ లీడర్ ఓ సొల్యూషన్‌ను కూడా సూచించారు.
‘జూలో సాంబార్ దుప్పుల సంఖ్య ఆడవాటి కంటే ఎక్కువగా ఉంది. వాటిని సపరేట్‌గా ఉంచితే బ్రీడింగ్ స్లో అవుతుంది. అప్పుడు జూలో ప్లేస్ సరిగ్గా సరిపోతుంది. సాంబార్ దుప్పి మాంసాన్ని మాంసాహార జంతువులకు ఆహారంగా పెట్టొచ్చు’ అని చెప్పాడు.

‘మాంసం తీసుకొస్తున్న వాహనాలను ఆందోళనకారులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. పోలీసులను పిలిచి వారిని చెదరగొట్టాలని అడిగాం. సెంట్రల్ జూ అథారిటీ నుంచి మాంసాహార జంతువులకు ఫుడ్ సూచిస్తారు. చట్ట ప్రకారం.. జూలోని జంతువుల మాంసాన్ని ఇతర జంతువులకు పెట్టకూడదు. సాంబార్ దుప్పి అనేది కూడా అడవి జంతువే. మేం అడవి జంతువులను చంపలేం’ అని తేజాస్ మేరిస్వామీ, డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ అన్నారు.

సాంబార్ డీర్ జంతువులను వైల్డ్ లైఫ్ (ప్రొటెక్షన్) యాక్ట్, 1972 ప్రకారం.. షెడ్యూల్ 3లో ఉన్నట్లుగా సంరక్షించాల్సిన బాధ్యత ఉంది.
కాసేపటి తర్వాత అస్సాం ఫారెస్ట్ మినిష్టర్ పరిమళ్ సుక్లాబైద్యా.. ‘జంతువుల న్యూట్రిషన్ కోసం వాటికి Beef తప్పక పెట్టాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు గేదెలు పెంచి వాటిని మాంసాహార జంతువులకు ఆహారం పెడుతున్నాయి. అస్సాంలో అంత స్టాక్ లేదు కాబట్టి ఇలా చేస్తున్నాం. బీఫ్ అనేది కేంద్రం నుంచి వచ్చిన గైడ్ లైన్ మాత్రమే’ అని వెల్లడించారు.


Related Tags :

Related Posts :