పీపీఈ కిట్ ధరించి సినిమా పాటకు స్టెప్పులేసిన డాక్టర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Doctor on COVID duty dances ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఆరోగ్యం పై చాలా శ్రద్ధ పెరిగిపోయింది. ఈ వైరస్ కాలంలో వైద్యులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనిది. అయితే, తాజాగా అస్సాంలో ఓ డాక్టరు పీపీఈ కిట్ ను ధరించి.. హృతిక్ రోషన్,టైగర్ ష్రాఫ్ నటించిన సూపర్ హిట్ మూవీ”వార్”లోని ఓ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మరింది.వివరాల్లోకి వెళ్తే…

అస్సాంలోని ఉత్తర్ క్రిష్ణపూర్ లోని సిల్చార్‌ మెడికల్‌ కాలేజీలో డాక్టర్‌ అరూప్‌ సేనాపతి కోవిడ్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్న కోవిడ్‌ రోగులను ఉత్సాహపరిచేందుకుగాను డాక్టర్‌ అరూప్‌ సేనాపతి పీపీఈ కిట్‌ ధరించి ‘వార్‌’ చిత్రంలోని ఘంగ్రూ పాటకు చిందులేశాడు. ఈ వీడియోను ఆయన సహా ఉద్యోగి డాక్టర్‌ సయ్యద్ ఫైజన్‌ అహ్మద్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.సిల్చార్‌ మెడికల్‌ కాలేజీలో కోవిడ్‌ డ్యూటీ చేస్తున్న నా సహా ఉద్యోగి, ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టర్‌ అరూప్‌ సేనాపతిని కలవండి. సిల్చార్‌ ఆస్పత్రిలో ఆయన కోవిడ్‌ రోగులను ఆనందపరిచే ప్రయత్నంలో భాగంగా వారిముందు డ్యాన్స్‌ చేస్తూ, వారి హృదయాలను గెలుచుకున్నాడు అనే క్యాప్షన్ తో వీడియోని పోస్టు చేశారు. ఈ వీడియోలో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇప్పటికే వీడియోని 2 లక్షల మందికి పైగా వీక్షించారు. 15వేలకు పైగా లైకులు వచ్చాయి. వెయ్యికి పైగా కామెంట్లు వచ్చాయి.

Related Tags :

Related Posts :