Assam,train engine arrested

రెండు హత్యల కేసులో దోషిగా తేలిన రైలు ఇంజిన్..అరెస్టు చేసిన అధికారులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Assam Train engine arrest : హత్యల కేసులో ఓ రైలు ఇంజిన్ .దోషిగా తేలింది. దీంతో అధికారులు ఆ రైలు ఇంజన్ ను అరెస్టు చేసి సీజ్ చేశారు. భారతీయ రైల్వే చరిత్రలోనే ఇటువంటి ఆశ్చర్యం కలిగించే ఘటన బహుశా ఇంతకు ముందెప్పుడూ జరిగిఉండిఉండదు.


వివరాల్లోకి వెళితే..అసోం ఫారెస్ట్ విభాగం అధికారులు… ఓ రైలు ఇంజిన్‌ని అరెస్టు చేసి.సీజ్ చేశారు. ఎందుకంటే ఆ రైలు ఇంజన్ ఓ హత్య కేసులో దోషిగా తేలింది. అదేంటీ రైల్ ఇంజన్ ను హత్య చేయటమేంటీ..దాన్ని అరెస్ట్ చేయటమేంటీ?..అని ఆశ్చర్యపోయే ఘటన అస్సాంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే..గత సెప్టెంబర్ 27న ఆ రైలు ఇంజన్ ఓ ఏనుగునీ..దాని పిల్ల చావుకు కారణమైంది. ఈ కేసుపై డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్ దాస్… సోమవారం…గౌహతిలోని బామునిమైదాన్ రైల్వే యార్డుకు వెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు రోడ్డుపై వాహనాల్ని సీజ్ చేసినట్లుగా ఫారెస్ట్ అధికారులు లోకోమోటివ్ (రైలు ఇంజిన్)ను సీజ్ చేశారు.


ఏనుగు..దాని పిల్ల చనిపోయిన ప్రమాద ఘటన లండింగ్ డివిజన్ ఫారెస్ట్ అధికారుల పరిధిలోని ప్రాంతంలో సెప్టెంబర్ 27,2020న జరిగింది. పట్టాలపై గూడ్స్ రైలు వేగంగా వెళ్తుండగా ఓ ఏనుగు, దాని పిల్ల పట్టాలు దాటుతూ ఆ గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ప్రమాదంలో తల్లి ఏనుగు అక్కడికక్కడే చనిపోగా.. పిల్ల ఏనుగును ఆ రైలు కిలోమీటర్ దూరం వరకూ ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో రైలు పైలట్, కోపైలట్ ఇద్దర్నీ రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. ఇది కావాలని చేసింది కాకపోయినా..ప్రమాదవశాత్తు అనుకోకుండా జరిగినా వారిద్దరినీ రైల్వే శాఖ సస్పెండ్ వేటు వేసింది.


కాగా..వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 ప్రకారం ఏనుగు షెడ్యూల్ 1లో ఉన్న వన్యప్రాణి. రిజర్వ్ ఫారెస్టులో వెళ్లేటప్పుడు రైళ్లు గంటకు 30 కిలోమీటర్ల వేగంతో వెళ్లాలి. అంతకుమించి వేగంగా వెళ్లకూడాదనే రూల్ ఉంది. కానీ ప్రమాదం జరిగినప్పుడు ఏనుగులను ఢీకొని వాటికి మరణానికి కారణమై ఆ రైలు వేగం గంటకు 60 కిలోమీటర్లు ఉందని రైల్వే అధికారుల దర్యాప్తులో తేలింది అందుకే వారిని సస్పెండ్ చేశామని డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్ దాస్ తెలిపారు.


పోలీసులు నేరాలు జరిగిన సందర్భంగా ఆయా ఆయుధాలను ఎలాగైతే సీజ్ చేస్తారో అలాగే మేం రైలు ఇంజిన్ ని సీజ్ చేశామని తెలిపారు. ఎందుకంటే ఈ ఘటనతో రైలు ఇంజిన్ కి కూడా సంబంధం ఉందని దాస్ వివరణ ఇచ్చారు. కాగా ఈశాన్య బోర్డర్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుభనన్ చందా దీనిపై స్పందిస్తూ..అరెస్ట్ చేసిన ఆ ఇంజిన్‌ని రిలీజ్ చేయించామనీ..కానీ రైళ్లు నిర్ణయించిన వేగం కంటే అధిక వేగంతో వెళ్తున్నాయనేది మాత్రం వాస్తవం అని ఆ వేగమే ఏనుగు..దాని పిల్ల మరణానికి కారణమైందని తెలిపారు.


రైలు ఇంజన్ ని సీజ్ చేయటమంటే దాన్ని ఫారెస్ట్ అధికారులు తమతో పట్టుకెళ్లంకాదనీ..దాన్ని వర్క్ చేయకుండా సీజ్ చేశారనీ తెలిపారు. దాన్ని సీజ్ చేసినట్లుగా రిపోర్టులో రాశారు. అందువల్ల దాన్ని మేం వాడే ఛాన్స్ ఉండదు. ఐతే… మేం దాన్ని విడిపించాం. కాబట్టి ఇప్పుడు మళ్లీ దాన్ని విడిపించి తిరిగి వినియోగిస్తున్నామని చందా చెప్పారు.


కాగా ఏనుగు..ఏనుగు పిల్ల మరణం..రైలును అరెస్ట్ చేయటం వంటి ఘటనలతో దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అలాగే అసోంలో ప్రతీ ఏటా రైళ్లు ఢీకొని ఏనుగులు మరణాలు వంటి విషయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. 2019లో అస్సోంలో రైళ్లు ఢీకొని 80 ఏనుగులు ప్రాణాలు కోల్పోయాయి. అలాగే 100 మంది మనుషులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో రైల్వే అధికారులు అసోంలో తిరిగే రైళ్ల వేగాన్ని తగ్గించడం ప్రారంభించారు. మరి ఇకనైనా వన్యప్రాణులతో పాటు మనుషుల ప్రాణాలు ఎంత వరకూ సురక్షితంగా ఉంటాయో వేచి చూడాలి.

Related Tags :

Related Posts :