లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

అస్సాం మిసింగ్ తెగ మహిళల తెగువ..ఎముకలు కొరికే చలిలో 21 రోజులుగా ధర్నా..

Published

on

Assam missing tribe womens protest : మహిళలు తలచుకుంటే సాధ్యంకానిదంటూ ఉండదు. తెగువ పట్టుదలలో వారికి వారే సాటి. ‘మహిళలు పాల్గొనని ఉద్యమాలు విజయాన్ని సాధించలేవు’అని ఓ మహానుభావుడు అన్నట్లుగా చరిత్రలో చూసుకుంటూ మహిళలు పాల్గొనని ఉద్యమం అంటూ ఏదీ లేదనే చెప్పాలి. భూమి కోసం భుక్తి కోసం మహిళలు చేసిన పోరాటాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అదిగో అటువంటి ఉద్యమమే చేస్తున్నారు అస్సాంలో ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయని మహిళలు. గత 21రోజుల నుంచి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు అస్సాంలోని లాయికా, దోధియా గ్రామాలకు చెందిన మహిళలు. మరి వీళ్లంతా ఇంత పట్టుదలతో ఓ పక్క చలిగాలులు వణికించేస్తున్నా ఎందుకు ఉద్యమం చేస్తున్నారు? ఉద్యమంలో ప్రాణాలు పోతున్నా ఎందుకు భయపడకుండా దేని కోసం పోరాటం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరికి ఉంది.

డిసెంబర్ 21 నుంచి తిన్‌సుకియా బోర్గురీ ప్రాంతంలోని ఒక మైదానంలో లాయికా, దోధియా గ్రామాలకు చెందిన 1480 కుటుంబాలు ధర్నాను కొనసాగిస్తున్నాయి. మిసింగ్ తెగకు చెందిన ఈ రెండు అటవీ గ్రామాలు గత 70 ఏళ్లుగా బ్రహ్మపుత్రా నది దక్షిణ తీరంలో ఉన్న డిబ్రూ-సైఖోవా నేషనల్ పార్క్ ప్రధాన క్షేత్రంలో ఉన్నాయి. అది నేషనల్ పార్క్ కావడంతో అక్కడ ప్రజలకు లభించే మౌలిక సదుపాయాలకు సంబంధించిన అన్ని ప్రభుత్వ పథకాలను నిలిపివేశారు.

దీంతో లాయికా, దోధియా గ్రామాల ప్రజలు గత కొన్నేళ్లుగా తమకు శాశ్వత పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరనసలకు దిగారు. ప్రభుత్వం ఎక్కడైనా వేరే భూముల్లో తమకు శాశ్వత నివాసం కల్పించేవరకూ ధర్నా విరమించబోమని వారు చెబుతున్నారు.

ఓ పక్క చలిగాలులు శరీరాన్ని గడ్డకట్టించేస్తున్నాయి. ఎముకలు కొరికే చలిలో కూడా ధర్నాను విరమించకుండా కొనసాగిస్తునే ఉన్నారు మహిళలు. ఈ క్రమంలో చలిగాలులకు ఆరోగ్యం దెబ్బతిని ఆందోళన చేసేవారిలో ఇద్దరు మహిళలు చనిపోయారు. మరోవైపు చాలా మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. దమయంతి అనే మహిళ తమ వ్యతిరేకతను, బాధను మిసింగ్ తెగ పాడుకునే ఒక పాటలా ఆలపించగా ఆ గానానికి ఆందోళన చేసేవారంతా కన్నీళ్లు పెట్టారు.

ఆ పాటకు అర్థం ఏమిటంటే..”కొండలు, నదులు, విశాల పర్వతాలు, చెట్లు, మొక్కలు కూడా మనిషుల జీవింతంలో వచ్చిన ఈ కష్టాలను చూసి ఏడుస్తూ ఉంటాయి’ అని..మేం బతికుంటామో లేదో కూడా తెలీదు. మమ్మల్ని ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో. ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర నీళ్లకు, అవి ఎక్కడ సముద్రంలో కలుస్తాయో వాటికి తెలీదు. అలాగే మా జీవితాలు ఏమవుతాయో కూడా మాకు తెలియటంలేదు అందుకే మా బాధలనే పాటగా పాడుతున్నానని ఆమె వాపోయింది.

మిసింగ్ తెగ ప్రజల ధర్నా..మహిళల కీలక పాత్ర
భారత్‌లో గత కొన్ని నెలలుగా షహీన్ బాగ్ నుంచి రైతుల నిరసనల వరకూ మహిళలు అన్నింటా ముందు నిలుస్తున్నారు. అలాగే మిసింగ్ తెగ మహిళలు కూడా తమ తెగువ చూపిస్తున్నారు. ఈ సందర్భంగా 40 ఏళ్ల రాధికా చక్రా అనే మహిళ మాట్లాడుతూ..”మేం ఇంత చలిలో ఈ ప్లాస్టిక్ గుడారంలో ఉంటున్నాం. ఈ నేలమీదే పడుకుంటాం. రాత్రి చలి పెరిగితే చలిమంట వేసుకుని రాత్రంతా మేలుకునే ఉంటాం. అన్ని బాధల్ని తట్టుకుని మా పోరాటాన్ని కొనసాగిస్తున్నాం. కొనసాగిస్తూనే ఉంటాం.

పగలు ఎండతో గుడారం వేడెక్కుతుంది. సాయంత్రం అయిందంటే చాలు చలిగాలికి చల్లగా అయిపోతుంది.మాకు మా పిల్లల గురించి..వారి భవిష్యత్తుగురించే దిగులు. పోరాటంలో పాల్గొన్నవారంతా జబ్బు పడుతున్నారు అయినా ప్రభుత్వానికి మనస్సు కరగటం లేదని వాపోతున్నారు.

పోరాటంలో భాగంగా గుడారాలల్లోనే కటిక నేలమీదనే వారు పడుకుంటారు. గుడారాల బయటే వండుకుంటారు. ఈ గుడారంలోని మహిళలు చిన్న చిన్న గ్రూపులుగా తమ పిల్లలతో, వృద్ధులతో ఉంటున్నారు. అక్కడ మరుగుదొడ్లు, కరెంట్ లాంటివేవీ ఉండవు. తాగునీళ్ల కోసం కొన్ని హాండ్ పంపులు తాత్కలికంగా వేశారు. కానీ ధర్నా చేస్తున్న వారందరూ తమకు ఎంత కష్టం వచ్చినా, ప్రభుత్వం నుంచి శాశ్వత పునరావాసం పొందేవరకూ తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *