లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

సరి-బేసి విధానంలో అస్సాం స్కూల్స్ రీ ఓపెన్

Published

on

అస్సాంలోని స్కూల్స్, విద్యాసంస్థలను సోమవారం నుంచి రీఓపెన్ చేయనున్నారు. కొవిడ్-19గైడ్ లైన్స్ ఆధారంగా ఏడునెలల నుంచి మూసి ఉంచిన స్కూల్స్ మళ్లీ తెరుచుకోనున్నాయి. అయితే 6నుంచి 12వ తరగతి వరకూ మాత్రమే స్కూల్స్ వచ్చేందుకు ఓకే చెప్పింది విద్యాశాఖ.

ఇదిలా ఉంటే అలా వచ్చే వారిలోనూ రిస్క్ తక్కువగా ఉండాలని సరి బేసి విధానంలో క్లాసులకు హాజరుకావాలని సూచిస్తున్నారు. 6, 8, 12వ తరగతులు సోమ, బుధ, శుక్రవారాల్లో హాజరుకావాలని 7, 9, 11తరగతులు మంగళ, గురు, శని వారాల్లో అటెండ్ అవ్వాలని వివరించారు.‘స్టూడెంట్స్ అంతా ఒకేసారి స్కూల్స్ కు రావడానికి వీల్లేదు. మార్నింగ్, మధ్యాహ్నం షిప్టులుగా డిఫరెంట్ బ్యాచెస్ గా హాజరుకావాల్సి ఉంది. ఇన్‌స్టిట్యూషన్ నిర్దేశించిన దాని ప్రకారం.. ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్‌లను నిర్ణయిస్తారు.

మొదటి బ్యాచ్ స్టూడెంట్లు ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకూ, రెండో బ్యాచ్ స్టూడెంట్లు 12గంటల 30నిమిషాల నుంచి 3గంటల 30నిమిషాల వరకూ ఉంటారని తెలిపారు.

రాజస్థాన్‌లో స్కూల్స్ బంద్ కొనసాగింపు :
Covid సంక్షోభం కారణంగా దీపావళి టపాసులను అమ్మడాన్ని రాజస్థాన్ గవర్నమెంట్ నిషేదించింది. ప్రజల ప్రాణాలను కాపాడటాన్ని ప్రభుత్వం ఛాలెంజింగ్ గా తీసుకుంటుందని సీఎం అశోక్ గెహ్లాత్ అన్నారు. దాంతో పాటు నవంబరు 16వరకూ స్కూల్స్, కాలేజీలు మూసే ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తూ.. కరోనా వైరస్ సంక్షోభం నుంచి బయటపడేందుకు నో మాస్క్- నో ఎంట్రీ, వార్ ఫర్ ద ప్యూర్ గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయాలని సూచించారు. దాంతో పాటు అన్‌లాక్ 6గురించి మీటింగ్ లో చర్చిస్తున్నట్లు తెలిపారు.

 

ashok gehlot

సీఎం సూచనలు:
రాష్ట్రంలో ఫైర్ క్రాకర్స్, ఫైర్ వర్క్స్‌ల అమ్మకాలు పూర్తిగా ఆపేయాలని సూచనలు ఇచ్చారు. ఫిట్‌నెస్ లేని వాహనాల కారణంగా జరుగుతున్న కాలుష్యాన్ని అడ్డుకోవాలని, కరోనావైరస్ ఇన్ఫెక్టెడ్ పేషెంట్ల హెల్త్, జనరల్ పబ్లిక్ హెల్త్ ను పొగ నుంచి కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే దీపావళి సందర్భంగా ఫైర్ వర్క్స్ ను నిషేదించాలని వివరించారు.

సీఎం అశోక్ ఆదేశాల మేరకు 2వేల మంది డాక్టర్ల రిక్రూట్‌మెంట్ త్వరలో పూర్తి కానుంది. సెలక్ట్ చేసిన డాక్టర్ల అపాయింట్మెంట్ 10రోజుల్లో పూర్తి చేయనున్నారు. అన్‌లాక్ 6 గైడ్ లైన్స్ ప్రకారం.. ప్రిన్సిపల్ సెక్రటరీ(హోం) అభయ్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్లు, స్కూల్ కాలేజీలు నవంబరు 16వరకూ మూసే ఉంచుతారని చెప్పారు.

వాటితో పాటుగా స్విమ్మింగ్ పూల్స్, సినిమా హాల్స్, థియేటర్స్, మల్టీప్లెక్సెస్, ఎంటర్‌టైన్మెంట్ పార్క్స్ లాంటి మొదలైనవి నవంబరు 30వరకూ క్లోజ్‌డ్‌గానే ఉంటాయి. పెళ్లిళ్లు లాంటి శుభకార్యాలకు గరిష్ఠంగా 100మంది మాత్రమే హాజరవ్వాలని వెల్లడించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *