Astronaut on Earth in bangalore

అంతరిక్షంలో ఉండాల్సిన వ్యోమగామి భూమిపై ప్రత్యక్షం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అంతరిక్షంలో ఉండాల్సిన ఓ వ్యోమగామి భూమిపై ప్రత్యక్షమయ్యాడు. బెంగళూరులోని రహదారుల అధ్వాన్న పరిస్థితిని ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఓ వ్యక్తి వ్యోమగామిలా మారాడు. వ్యోమగామి దుస్తులతో అక్కడ గుంతల రోడ్డుపై నడుస్తూ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజెప్పే ప్రయత్నం చేశాడు.

అంతరిక్షంలో గ్రహంపై నడిచినట్టుగా నటిస్తూ ఓ వీడియోను చిత్రీకరించాడు. ఆ వీడియోను చూస్తే  ఎవరికైనా అతను అంతరిక్షంలోనే ఉన్నాడేమో అనే భావన కలుగుతుంది. ఓ ఆటో ఆ రోడ్డుపై వెళ్లేంత వరకూ మనకది రహదారి అని గుర్తుపట్టలేనంతగా ఉంది.  

బాదల్ నంజుందస్వామి అనే కళాకారుడికి ఈ ఆలోచన వచ్చింది. గుంతల రోడ్లతో ప్రజలు పడుతున్న బాధలను వెలుగెత్తేందుకు వినూత్న ప్రయత్నం చేశారు. వ్యోమగామి దుస్తులతో గుంతల రోడ్డుపై నడుస్తూ వినూత్నంగా తన నిరసనను తెలిపారు. రోడ్డుపై ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ అంతరిక్షంలోనే ఉన్నట్లు రూపొందించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Also Read : చింతకాయ@ కేజీ రూ.1000

 

Related Posts