కరోనా భయం లేదంట… ఏకంగా విందు భోజనాలు చేసిన చెక్ రిపబ్లిక్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రపంచమంతా కరోనా వైరస్ మహమ్మారితో వణికిపోతుంటే అక్కడ మాత్రం ఏ భయం లేకుండా పార్టీలు, విందు భోజనాలు చేస్తున్నారు. చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ లో మాత్రం కరోనా మాకు ఏమి భయం లేదంటూ వంతెన మీద కలిసికట్టుగా విందు ఆరగించారు. వారిలో ఏ ఒక్కరూ మాస్క్ పెట్టుకోలేదు. కనీసం వారి మధ్య సామాజిక దూరం కూడా లేదు. అంతేకాకుండా ఒకరి ఆహారాన్ని మరొకరు పంచుకుంటూ ఆనందంగా గడిపేశారు.

కరోనా వేళ జాగ్రత్తగా ఉండకుండా అలాంటి పనులేంటి అని తిట్టుకుంటున్నారా? అయితే, వారికి ఆ భయం లేదంటా, ఎందుకంటే.. ఆ దేశంలో కరోనా కేసులు దాదాపు తగ్గిపోయాయి. కొత్తగా కేసులు కూడా నమోదు కావడం లేదు. దీంతో ప్రజల్లో ధైర్యం నింపేందుకు ప్రభుత్వమే విందులు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది.

చెక్ రిపబ్లిక్ రాజధాని ప్రేగ్‌లో కరోనా వైరస్‌కు గుడ్‌బై చెబుతూ.. మంగళవారం (జూన్ 30,2020)న మెడీవల్ చార్లెస్ బ్రిడ్జి మీద ఈ విందు కార్యక్రమం జరిగింది. ఓండ్రేజ్ కోబ్జా అనే వ్యక్తి ఆధ్వర్యంలో వ్లతవ నదిపై ఉన్న వంతెన పైన 500 మీటర్ల పొడవైన టేబుల్ ను ఏర్పాటు చేశారు. అందులో వందలాది మంది పాల్గొని తమతో తెచ్చుకున్న ఆహారం, డ్రింక్స్‌ను షేర్ చేసుకుంటై, పాటలు పాడుతూ ఆనందంగా వేడుకను జరుపుకున్నారు.

కోబ్జా మాట్లాడుతూ.. ‘మనం భయపడకూడదు. మనం ఇంట్లోనే ఉండిపోకూడదని చెప్పేందుకే ఈ కార్యక్రమం నిర్వహించాం’ అని తెలిపారు. ఇప్పటివరకు 10.7 మిలియన్ జనాభా కలిగి ఉన్న చెక్ రిపబ్లిక్‌లో 11,960 మందికి కరోనా వైరస్ సోకింది. ఈ మహమ్మారితో 349 మంది చనిపోయారు.

Read:బ్లడ్ టెస్టు చాలు.. మీపై కరోనా తీవ్రత ఎంత ఉందో చెప్పేస్తుంది!

Related Posts