కరోనా ఆసుపత్రిలో మంటలు.. పది మంది మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ సోకిన ప్రజలు చికిత్స పొందుతున్న ఒక ఆసుపత్రి ICU వార్డులో మంటలు చెలరేగాయి. ఈ సంఘటనలో 10మంది రోగులు మరణించారు.

ఈ అగ్నిప్రమాదంలో రెండు గదులు పూర్తిగా కాలిపోయాయని, 16 మంది రోగులు అందులో ఉండగా.. 10 మంది మృతి చెందారని, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.ఈ ఘటన రొమేనియా దేశంలో పియాట్రా నీమ్ట్‌ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఉత్తర నగరమైన పియాట్రా నీమ్ట్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో COVID-19 రోగులతో నియమించబడిన ఇంటెన్సివ్ కేర్ వార్డ్ ద్వారా షార్ట్‌సర్క్యూట్‌ జరగడంతో మంటలు వ్యాపించాయని స్థానిక అత్యవసర పరిస్థితుల ఇన్‌స్పెక్టర్ తెలిపారు.ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు మినహా మరణించిన, గాయపడిన వారందరూ ఆసుపత్రి రోగులేనని అధికారులు చెప్పారు.

Related Tags :

Related Posts :