లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

పోలీస్ స్టేషన్ లో కుర్చీలు, కర్రలతో ఇరువర్గాలు పరస్పరం దాడి

Published

on

two groups attack : కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్ లో ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దిగాయి. కుర్చీలు, కర్రలతోపాటు అందుబాటులో ఉన్న వస్తువులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గండిపేట గ్రామానికి చెందిన ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. దీంతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఇరు వర్గాలు మళ్లీ పరస్పరం దాడి చేసుకున్నాయి.మాట మాట పెరిగి ఇరువురు పోలీస్ స్టేషన్ లోనే కొట్లాడుకున్నారు. ఏకంగా పీఎస్ లోనే గొడవ పడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


airline ఉద్యోగి చెంప ఛెళ్లుమనిపించిన SI : పోలీసు పొగరుకి థమ్కీ ఇచ్చిన సిబ్బంది


ఒకవర్గం వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. మరోవర్గం కూడా గంట ఆలస్యంగా అదే పోలీస్ స్టేషన్ కు చేరుకోగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొంది. అయితే మాట మాట పెరిగి పీఎస్ ఆవరణంలోనే ఒకరినొకరు తిట్టుకుంటూ పరస్పరం దాడులు చేసుకున్నారు. కర్రలు, కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు. అక్కడున్న పోలీసులు కూడా వారిని నిలువరించలేకపోయారు.అక్కడే ఉన్న ఎస్ ఐ కూడా క్వార్టర్స్ నుంచి బయటికి రాకపోవడంతో ఇరువర్గాల ఘర్షణ మరింత ముదిరింది. ఇరువర్గాలు ఒకరిపైమరొకరు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ ఘటనలో కొందరు గాయపడటంతో వారిని చికిత్స కోసం కామారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *