Atlee's Film With Shah Rukh Khan Allegedly Titled As Sanki, Fans Laud The Director For His Achievement

అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ సినిమా!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

షారూఖ్ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసే ఫ్యాన్స్ అందరికి గుడ్ న్యూస్. ఏడాది నుంచి సినిమాలు లేక ఖాళీగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ ఓ సినిమా ఫైనల్ చేశాడు. అయితే ఇది నార్త్ వాళ్లకి మాత్రమే కాదు..సౌత్ వాళ్లకి కూడా గుడ్ న్యూసే. ఎందుకంటే షారుక్ ఈసారి సినిమా ప్లాన్ చేసింది బాలీవుడ్ డైరెక్టర్ తో అనుకుంటున్నారా.? కాదు.. సౌత్ ఫామ్ డైరెక్టర్ అట్లీతో. 
   
ఇన్నాళ్లు వెయిట్ చేసిన షారూఖ్ కి బాలీవుడ్ కాకుండా సౌత్ డైరెక్టర్ నచ్చాడు. అందుకే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న డైరెక్టర్ అట్లీతో సినిమా కు సైన్ చేశాడు షారూఖ్. ఈ సినిమా సంకీ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. షారూఖ్ యాక్షన్ ఎంటర్ టైనింగ్ స్టోరీస్ కోసం చూస్తున్నాడట. దీంతో ఈ మద్యనే అట్లీ  విజయ్ తో బిగిల్ సినిమా చేసి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. ఇదే ఫామ్ లో సంకి సినిమాను కూడా పట్టాలెక్కించేస్తున్నాడు అట్లీ.

మరి బాలీవుడ్ హీరో.. కోలీవుడ్ డైరెక్టర్ కలిసి ఎలాంటి సినిమా తీస్తారో చూడాలి. ఈ సినిమా కోసం నార్త్-సౌత్ జనాలు చాలా ఇంట్రస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు.  
 

Related Posts