Home » బిగ్ బాస్-3 విజేత రాహుల్ సిప్లిగంజ్ పై దాడి
Published
11 months agoon
By
chvmurthyబిగ్ బాస్ 3 విజేత, గాయకుడు,నటుడు, రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్ లోని ఓ పబ్బులో బుధవారం రాత్రి దాడి జరిగింది. పబ్బులో జరిగిన గొడవలో కొందరు వ్యక్తుల తలపై బీరు సీసాలతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే ఆయన్ను గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ తన స్నేహితులు, ఓ స్నేహితురాలితో కలిసి గచ్చిబౌలిలోని ఓ పబ్ కు బుధవారం రాత్రి 11.45 గంటల సమయంలో వచ్చారు. అక్కడే ఉన్న కొంతమంది యువకులు రాహుల్ వెంట వచ్చిన యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారట. దీంతో రాహుల్ వారిని నిలదీయడంతో మాటామాటా పెరిగింది. అప్పటికి గొడవ సర్దుమణిగినప్పటికీ… అరగంట తర్వాత ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో కొందరు యువకులు రాహుల్ ను బీరు సీసాలతో తలపై కొట్టారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వారిలో వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే సోదరుడు ఉన్నట్లు తెలుస్తోంది.
See Also | రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ ; విద్యాశాఖ కీలక నిర్ణయం
బిగ్ బాస్ సీజన్ 3 లో అసలు ఫేవరేట్ ఏమాత్రం కాని రాహుల్ ఫైనల్ గా టైటిల్ విన్నర్ అయ్యాడు. పునర్నవితో లవ్వు గివ్వు అంటూ షోని రంజింప చేసిన రాహుల్ కు ఆడియెన్స్ ఓట్లు వేశారు. నిజ జీవితంలో భార్యాభర్తలు అయిన వితిక, వరుణ్ సందేశ్ కంటే రాహుల్, పునర్నవి మధ్య నడిచే ఎపిసోడ్ అత్యంత రసవత్తరంగా సాగాయి. బిగ్ బాస్ క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు రాహుల్ భారీ ప్లాన్ లే వేశాడు. ఇన్నాళ్ళు సింగర్ గానే అలరించిన రాహుల్ ఇక మీదట నటుడిగా కూడా కనిపించనున్నాడు.
క్రియేటివ్ డైరెక్టర్గా కృష్ణవంశి దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాలో రాహుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘రంగమార్తాండ’. మరాఠీ సినిమా ‘నటసామ్రాట్’కు ఇది రీమేక్. ‘నటసామ్రాట్’ మరాఠీలో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దీన్ని తెలుగులో తెరకెక్కిస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో రాహుల్ కు మంచి పాత్ర పడ్డదట. కెరియర్ ఫుల్ జోష్ లో ఉన్న రాహుల్ అనవసరమైన గొడవల్లో చిక్కుకోవడం దురదృష్టమని చెప్పొచ్చు.