key details of Police Commission Mahesh Chandra Ladda

పక్కా ప్లాన్ తోనే జగన్ పై దాడి : సీపీ కీలక వివరాలు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖపట్నం : కోడి కత్తి కేసు విషయంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా కీలక విషయాలను వెల్లడించారు. సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో కత్తి దాడి పక్కా ప్రణాళికతోనే జరిగిందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. డిసెంబర్ 2న  మీడియాతో మాట్లాడిన సీపీ మాట్లాడుతు..ఈ కేసులో నిందితుడు శ్రీనివాసరావు గతంలో వెల్డర్‌గా, కేక్ మాస్టర్‌గా, కుక్‌గా పనిచేశాడని..2017 అక్టోబరు 18నే జగన్‌పై దాడి చేయాలని శ్రీనివాసరావు ప్లాన్ వేసినా సాధ్యం కాకపోవటంతో అక్టోబరు 25న విశాఖ ఎయిర్ పోర్ట్ లో మరోసారి దాడిలో జగన్ పై దాడికి పాల్పడ్డాడని మహేశ్ చంద్ర తెలిపారు.

దాడి జరిగిన రోజే కోడికత్తికి శ్రీనివాసరావు సాన పట్టించాడని..సీపీ ఈ విషయం అతడి సహచరులకు కూడా తెలుసనీ..దాడి జరిగిన రోజు ఉదయం 4:55 గంటలకే ఇంటి నుంచి వచ్చిన శ్రీనివాసరావు 8 గంటలకు హేమలత.. అమ్మాజీ అనే మహిళలకు ఫోన్ చేసి ఈ రోజు తాను టీవీలో కనిపిస్తానని చెప్పాడని ఫోన్ చేసి చెప్పాడనీ.. ‘ఈ రోజు ఓ సంచలనం చూస్తారు’ అని అమ్మాజీతో శ్రీనివాసరావు చాలాసార్లు చెప్పాడనీ..ఇకపై తన వద్దకు రావాలంటే అపాయింట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాడని సీపీ మీడియా కు తెలిపారు.

ఉదయం 9 గంటల సమయంలో రెస్టారెంట్‌లో మరోసారి కోడికత్తికి సాన పెట్టిన తరువాత దానిని వేడి నీటిలో స్టెరిలైజ్ చేసాడని తెలిపారు. అనంతరం జగన్ విమానాశ్రయంలోకి రాగానే దానితో దాడి చేశాడని సీపీ మహేశ్ చంద్ర లడ్డా వివరించారు. జగన్‌తో తానున్న ఫ్లెక్సీని గతేడాది జనవరిలోనే శ్రీనివాసరావు తయారు చేసి పెట్టుకున్నాడని తెలిపారు. జగన్‌పై విష ప్రయోగం చేయాలనే ఉద్దేశం శ్రీనివాసరావుకు లేదని సీపీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. 
ఏపీ, విశాఖపట్నం, వైసీపీ,  జగన్, ఎయిర్ పోర్ట్, దాడి, సీపీ, మహేశ్ చంద్ర లడ్డా, ప్రెస్ మీట్, 

Related Posts