attack on rtc staff

సీఎం కేసీఆర్ పిలుపుతో విధుల్లో చేరిన ఆర్టీసీ సిబ్బందిపై దాడి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ డిపో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ పిలుపుతో విధుల్లో చేరిన ముగ్గురు సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. కండక్టర్‌ కోమల, డ్రైవర్లు

మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ డిపో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ పిలుపుతో విధుల్లో చేరిన ముగ్గురు సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. కండక్టర్‌ కోమల, డ్రైవర్లు తాజుద్దీన్‌, వాజిద్‌లపై దాడి చేసి కొట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

ఆందోళనలో భాగంగా మహబూబ్ నగర్ లో ఆర్టీసీ కార్మికులు నిరసన చేపట్టారు. ఇది ఉద్రిక్తంగా మారింది. ఆర్టీసీ బస్సులను అడ్డగించిన కార్మికులు… విధుల్లో చేరిన వారిపై దాడికి దిగారు. బస్సులోంచి కండక్టర్, డ్రైవర్ ను బయటకు లాగి కొట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, విధుల్లో చేరిన సిబ్బందిపై దాడిని అధికారులు సీరియస్ గా తీసుకున్నారు. దాడిని ఖండించారు. ఇది కరెక్ట్ కాదని అన్నారు. 

సిబ్బందిపై  దాడి ర్వాత కార్మికులు డిపోలోకి వెళ్లేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. అటు నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఆర్టీసీ కార్మికుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. రైల్వే గేట్ దగ్గర రాస్తారోకో చేస్తున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది.

తమ సమస్యలను పరిష్కరించాలంటూ కామారెడ్డి బస్టాండ్ ముందు ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతలకు దారితీసింది. డిపోలోకి వెళ్లేందుకు యత్నించిన ఆర్టీసీ కార్మికులను అడ్డుకున్నారు పోలీసులు. డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు కార్మికులు. దీంతో కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేయడంపై కార్మిక సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి.

Related Posts