లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

వీడియో.. చొక్కా చించి, మెడపై చేతులేసి, రౌండప్ చేసి, రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి

హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజమ్(PRISM) పబ్ లో బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడి సంచలనం రేపుతోంది. రాహుల్ పై దాడి చేసింది తాండూరు ఎమ్మెల్యే పైలెట్

Published

on

attack video released on bigg boss winner rahul sipligunj in prism pub

హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజమ్(PRISM) పబ్ లో బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడి సంచలనం రేపుతోంది. రాహుల్ పై దాడి చేసింది తాండూరు ఎమ్మెల్యే పైలెట్

హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజమ్(PRISM) పబ్ లో బిగ్ బాస్ విన్నర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై దాడి సంచలనం రేపుతోంది. రాహుల్ పై దాడి చేసింది తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి అతడి స్నేహితులుగా పోలీసులు గుర్తించారు. బుధవారం(మార్చి 4,2020) అర్థరాత్రి రాహుల్ సిప్లిగంజ్, రితేష్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది. అందులో రితేష్ రెడ్డి, అతడి స్నేహితులు.. రాహుల్ ను రౌండప్ చేయడం, చొక్కా చించడం, మెడపై చేతులేసి దాడి చేయడం ఉంది. ఓ వ్యక్తి బీరు బాటిల్ తో రాహుల్ పై దాడి చేశాడు. ఈ దాడిలో రాహుల్ తలకు, ముక్కుకి గాయాలు అయ్యాయి. రాహుల్ పై దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(రాహుల్ సిప్లిగంజ్‌ని రౌండప్ చేసి రక్తం కారేలా కొట్టారు, పాత గొడవలతో పక్కా పథకం ప్రకారమే దాడి?)

తప్పు ఎవరిది?
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, రాహుల్ మధ్య ఏం జరిగింది? అనేది మిస్టరీగా మారింది. అసలు తప్పు ఎవరిది అనేది తెలియాల్సి ఉంది. అమ్మాయి విషయంలో గొడవ జరిగిందని కొందరు అంటున్నారు. పాత గొడవలే కారణం అని మరికొందరు అంటున్నారు. రాహుల్, రితేష్ రెడ్డి స్నేహితులు. అయితే గతంలో ఓ అమ్మాయి, ఈవెంట్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందట. దాన్ని మనసులో పెట్టకుని రితేష్ రెడ్డి తన స్నేహితులతో పబ్ కి వచ్చి రాహుల్ పై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, రాహులే తమను వేధించాడని, ప్రతిఘటించడంతో దాడి జరిగిందని రితేష్ రెడ్డి స్నేహితులు అంటున్నారు.

గొడవపై ఫిర్యాదు చేయని రితేష్ రెడ్డి, రాహుల్ సిప్లిగంజ్:
కాగా, ఈ గొడవపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడం చర్చకు దారితీసింది. దీన్ని సుమోటోగా తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా లోతుగా దర్యాఫ్తు చేస్తున్నారు. రాహుల్ పై దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటామని, వారిపై చర్యలు తీసుకుంటామని గచ్చిబౌలి పోలీసులు తెలిపారు. ఈ దాడిలో గాయపడిన రాహుల్.. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. ఆ తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.