గోల్కొండలో ఉత్సవాలు లేవ్!..ప్రగతి భవన్ లో పంద్రాగస్టు?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

గోల్కొండలో పంద్రాగస్టు ఉత్సవాలు జరగవని, ప్రగతి భవన్ లోనే నిరాడంబరంగా జెండా ఆవిష్కరణ జరుగుతుందని తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. గోల్కొండ కోటలో ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్ జెండా ఆవిష్కరణ చేయడం ఆనవాయితీగా వస్తోంది.

కానీ..ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా కేసులు ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలో పంద్రాగస్టు వేడుకలు నిర్వహంచడం సవ్యం కాదని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ సంవత్సరం ప్రగతి భవన్ కే పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ..దీనిపై ప్రభుత్వం ఎలాంటి అధికారికంగా ప్రకటిన విడుదల చేయలేదు.

కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్‌ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిపినట్లుగానే స్వాతంత్య్ర దినోత్సవం సైతం నిర్వహించాలని ఇటీవల మంత్రివర్గం తీర్మానించింది.

కొవిడ్‌ నిబంధనలకు లోబడి పంద్రాగస్టు వేడుకలను నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే ప్రముఖుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఆగస్టు 15వ తేదీన ఉదయం 10 గంటలకు ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌లలో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

Related Posts