పెళ్లి పేరుతో విద్యార్ధినిపై అత్యాచారం చేసిన పోలీసు కానిస్టేబుల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మహిళలపై  పోలీసులు చేస్తున్న అకృత్యాలు రోజుకొకటి వెలుగు చూస్తున్నాయి. పెళ్లి  చేసుకుంటానని చెప్పి నమ్మించి… ఒక కాలేజీ విద్యార్ధినిని లోబరుచుకుని ఆమెతో సుఖాలు అనుభవించి, పెళ్లి మాట ఎత్తేసరికి బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టిన కానిస్టేబుల్ ఉదంతం మహారాష్ట్రలో  వెలుగు చూసింది.మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాకు చెందిన పోలీసు కానిస్టేబుల్ రవీంద్ర దభాడే(32) కు ఒక కాలేజీ విద్యార్దినితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం క్రమేపి ప్రేమగా మారింది.  పెళ్లి  చేసుకోవాలనీ నిశ్చయించుకున్నారు. ఎలాగూ పెళ్లి చేసుకుంటాం కదా… శృంగారాన్ని ఎంజాయ్ చేద్దామని విద్యార్ధిని పై వత్తిడి తెచ్చాడు ఆ పోలీసు కానిస్టేబుల్. ఆమెకు నమ్మకం  కలిగించేలా ప్రవర్తించి ఆమెతో  శృంగారం చేశాడు.

ఆసమయంలో విద్యార్ధినికి తెలియకుండా వీడియో తీసాడు. కొన్నాళ్లకు ఆమె పెళ్లి చేసుకుందామని అతడ్ని అడిగింది.  అప్పటి నుంచి…. ఆమెతో సన్నిహితంగా మెలిగిన  వీడియో చూపించి ఆమెను బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభించాడు. వారిద్దరూ శృంగారంలో పాల్గోన్న వీడియో చూపించి ఆమెపై పలుసార్లు లైంగిక దాడి చేశాడు.ఇక రవీంద్ర పెళ్లి చేసుకోడని తెలియటంతో  మోసపోయిన విద్యార్దిని … వేరోక వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు  సిధ్దపడింది. అతనితో ముహూర్తాలు కూడా నిశ్చయించుకున్నారు. త్వరలో పెళ్లి జరుగుతుందనగా రవీంద్ర,  విద్యార్ధినితో కలిసి చేసిన పోర్న్ వీడియోను వరుడికి పంపించాడు. దీంతో ఆపెళ్లి కాస్తా రద్దు అయ్యింది.

దీంతో బాధితురాలు రవీంద్ర దభాడే పై ఫిర్యాదు చేసేందుకు  ఔరంగాబాద్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఆగస్ట్ 1న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అప్పటికే నిందితుడు రవీంద్ర దభాడే కు కరోనా సోకటంతో క్వారంటైన్ సెంటర్లో ఉన్నాడు. హోమ్ ఐసోలేషన్ కూడా పూర్తయిన తర్వాత సోమవారం సైబర్ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.


Related Tags :

Related Posts :