లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

తొలి వన్డే‌లో ఆసీస్‌దే పైచేయి

Published

on

Aus vs Ind: సెంచరీలకు మించిన స్కోరు నమోదు చేసిన ఫించ్ (114), స్మిత్ (105; 66బంతుల్లో 11ఫోర్లు, 4సిక్సులు) ఇండియా ముందు భారీ టార్గెట్ ఉంచారు. చేధనలో టీమిండియా తడబాటుకు లక్ష్యాన్ని సాధించలేక నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 66 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఐపీఎల్ 2020 తర్వాత ఆడిన తొలి వన్డేలో టీమిండియా నిలదొక్కుకోలేకపోయింది. ఓ వైపు భారీ టార్గెట్, మరో వైపు నిలకడలేమి జట్టును కుంగదీసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా ఆరంభం నుంచి దూకుడుగానే కనిపించింది. ఓపెనర్ల మధ్య చక్కటి భాగస్వామ్యం జట్టును ముందుకు నడిపించింది. వార్నర్(69), ఫించ్(114)ల భాగస్వామ్యానికి తెరదించేందుకు పోరాడిన టీమిండియాను షమీ కాపాడాడు. 27.5 ఓవర్ల వద్ద వార్నర్ ను అవుట్ చేయడంతో స్మిత్(105) బరిలోకి దిగాడు. టాపార్డర్ పర్ఫెక్ట్ హిట్టింగ్ తో రెచ్చిపోవడంతో ఆసీస్ 6వికెట్ల నష్టానికి 374పరుగులు చేయగలిగింది.హార్దిక్ పాండ్యా(90)వీరోచిత పోరాటం చేసినప్పటికీ విజయానికి చేరువ కాలేకపోయింది. అంచనాలకు అందుకోలేకపోయిన మయాంక్(22), విరాట్ కోహ్లీ(21)లు పది ఓవర్లు ముగియక ముందే పెవిలియన్ బాటపట్టారు. రెండు బంతుల వ్యవధిలోనే శ్రేయాస్ అయ్యర్(2) హ్యాజిల్‌వుడ్‌కు క్యాచ్ ఇవ్వడంతో పది ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా 80పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆ తర్వాత కేఎల్ రాహుల్ (12), రవీంద్ర జడేజా(90), నవదీప్ సైనీ(29), షమీ(13), బుమ్రా(0)లు ఆడటంతో ఇన్నింగ్స్ పూర్తయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో షమీ 3వికెట్లు పడగొట్టగా, బుమ్రా, సైనీ, చాహల్ తలో వికెట్ తీయగలిగారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *