లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

టీమిండియాకు సారీ చెప్పిన ఆస్ట్రేలియా, మరోసారి జాత్సహంకార వ్యాఖ్యలు

Published

on

Australia apologizes to Team India : ఆస్ట్రేలియా అభిమానులు నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న టీమిండియా ప్లేయర్స్ బుమ్రా, సిరాజ్ పై జాత్సాహంకార వ్యాఖ్యలు చేసిన ఆసీస్ ఫ్యాన్స్ మరోసారి..అదే విధంగా ప్రవర్తించారు. దీంతో టీమిండియా టీంకు ఆసీస్ టీం క్షమాపణలు చెప్పింది. ఆస్ట్రేలియాతో టీమిండియా టెస్టు మ్యాచ్ లు ఆడుతున్న సంగతి తెలిసిందే. మూడో టెస్టు లో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పై జాత్సహంకార వ్యాఖ్యలు చేశారు.

రెండో సెషన్ లో కామెరాన్ గ్రీన్ ధాటిగా ఆడుతున్నాడు. సిరాజ్ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఈ సమయంలో..అక్కడున్న ప్రేక్షకుల్లో కొందరు సిరాజ్ ను ఉద్దేశించి ఏవో వ్యాఖ్యలు చేశారు. దీంతో..సిరాజ్ తాత్కాలిక కెప్టెన్‌ రహానె దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. వెంటనే అంపైర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనివల్ల కాసేపు ఆటకు అంతరాయం ఏర్పడింది. మైదానం సిబ్బంది, పోలీసులు వ్యాఖ్యలు చేసిన ఆరుగురిని బయటకు పంపించారు. ఈ విషయం పట్ల క్రికెట్ ఆస్ట్రేలియా టీమ్ ఇండియాకు క్షమాపణలు చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

శనివారం జరిగిన మ్యాచ్ లో కూడా భారత పేసర్లు బుమ్రా, సిరాజ్ లపై ఓ ఆస్ట్రేలియా ప్రేక్షకుడు జాత్సహంకార వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీసీసీఐ మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ కు కంప్లైట్ చేసింది. ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో ఫీల్డింగ్ చేస్తున్న బుమ్రా, సిరాజ్ లపై జాత్సహంకార వ్యాఖ్యలు చేశారు.