లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

ఫస్ట్ టెస్ట్‌లో చిత్తుగా ఓడిన భారత్.. 8వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం

Published

on

australia-go-1-0-up-after-indias-36-all-out

Australia: ఆస్ట్రేలియాతో జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా విఫలం అయ్యింది. ఫస్ట్ డే బ్యాటింగ్‌కు ప్రతికూలమైన పిచ్‌పై ఓపికగా తనదైన బ్యాటింగ్‌తో రాణించిన భారత్ జట్టు.. రెండవ ఇన్నింగ్స్‌లో మాత్రం చిత్తయ్యింది.

ఫస్ట్ ఇన్నింగ్స్‌లో అధ్భుతంగా రాణించినా.. రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా 36పరుగులకే ఆలౌట్ అయ్యి.. అత్యంత చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో 90పరుగుల టార్గెట్‌తో రెండవ ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. పింక్‌ బాల్‌ టెస్టులో 8వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అంతుకుముందు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు.. 36 పరుగలకే ఆలౌట్ అయ్యింది. ఇప్పటివరకు టీమిండియాకు టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యల్ప స్కోరు ఇదే. 46ఏళ్ల తర్వాత టీమిండియా ఖాతాలో ఈ చెత్త రికార్డు నమోదయ్యింది.

రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఓపెనర్లలో మ్యాథ్యూ వాడే (33), జో బర్న్స్ (51), మార్న్స్ (6), స్టీవ్ స్మిత్ (1 నాటౌట్)తో నిలిచారు. భారత్ నిర్దేశించిన 90పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఆసీస్ ఛేదించింది. ఆసీస్ ఓపెనర్లు ఇద్దరే విజయ లక్ష్యానికి చేరువ చేయగా.. ఆ తర్వాత వచ్చిన మార్న్స్, స్మిత్ జట్టును విజయతీరాలకు చేర్చారు.

అడిలైడ్ తొలి టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ జట్టు స్కోరు 70 పరుగుల వద్ద 17.2 ఓవర్లలో ఆసీస్ తొలి వికెట్ కోల్పోగా.. రెండో వికెట్ 83 పరుగుల వద్ద కోల్పోయింది. 21 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి ఆసీస్ 93 పరుగులు చేసి విజయం దక్కించుకుంది.