ప్రపంచ వ్యాప్తంగా ఉండే మొత్తం కరోనా వైరస్ ఒక్క స్పూను ఉంటుందంట!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Australia mathematician corona virus fits in teaspoon : చైనాలో పుట్టిందని చెబుతున్న కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాల్నే గడగడలాడించేస్తోంది. ప్రజలు గుండెలు గుప్పిట్లో పెట్టుకుని మొహాలకు మాస్కులు కట్టుకుని జీవిస్తున్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలన్ని ఛిన్నాభిన్నం చేసేసి..ప్రజల్ని రోడ్డున పడేసి విలాసంగా వికటాట్టహాసం చేస్తోంది కరోనా మహమ్మారి.ఈ కరోనా వైరస్ పరిమాణంలో అతి సూక్ష్మమైనా ప్రపంచాన్ని అల్లకల్లో చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉండే ఈ వైరస్ మొత్తం చూస్తే కేవలం ఒకే ఒక్క ‘టీ స్పూన్’ పరిమాణంలో మాత్రమే ఉంటుందని ఆస్ట్రేలియా నిపుణుడు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కరోనా రక్కసి ప్రజల ఆరోగ్యంపైనే కాదు, సామాజిక, ఆర్ధిక జీవనంపైనా పెను ప్రభావం చూపిస్తోంది.
ఈ క్రమంలో గణితంతో మ్యాజిక్కులు చేసే మాట్ పార్కర్ అనే ఆస్ట్రేలియా నిపుణుడు కరోనా వైరస్ గురించి పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. ప్రపంచంలో ఉన్న కరోనా వైరస్ మొత్తాన్ని పోగు చేస్తే అది ఓ ‘టీస్పూను’లో సరిపోతుందని పార్కర్ చెబుతున్నారు. ఇది విన్నవారంతా ఆశ్యర్యపోతున్నారు.

మగాళ్లకు మాత్రమే వస్తున్న వైరస్
ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ మొత్తం పరిమాణం మహా అయితే ‘‘8 ML’ ఉంటుందని, ఓ టీస్పూనులో 6 ML పడుతుందని వివరించారు మాట్ పార్కర్. కరోనా వైరస్ కణం చాలా చిన్నదని..అతి సూక్ష్మమైనదనీ..కానీ అది మాత్రం ప్రపంచవ్యాప్తంగా 53 మిలియన్లకు పైగా కేసులు నమోదు అయిన క్రమంలో తాను గణించిన మేరకు అది ఓ స్పూనుకు కొంచెం ఎక్కువ ఉంటుందేమో అని తెలిపారు. ఓ టీస్పూన్ వైరస్ తో ఇంత పెద్ద ప్రపంచం కష్టపడుతోందని మాట్ పార్కర్ నమ్మశక్యంకాని విషయాన్ని వెల్లడించారు.కాగా..కరోనా వైరస్ కణం మానవ కణాల కంటే పది లక్షల రెట్లు చిన్నది. ఆ లెక్కన ఇప్పుడున్న కేసుల ఆధారంగా ప్రపంచంలో 3.3 మిలియన్ బిలియన్ల కొవిడ్-19 కణాలు ఉన్నాయని మాట్ పార్కర్ పేర్కొన్నారు. ఇంత చిన్న పరిమాణంలో ఉండే ఈ మహమ్మారి ప్రంపంచాన్ని కకావికలం చేసి పారేస్తోందని అన్నారు. రోజుకు మూడు లక్షల కేసులు నమోదవుతున్నాయి. కాగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు 5 కోట్ల 43 లక్షల 12వేలకు పైగా చేరుకున్నాయి. మృతుల సంఖ్య 13లక్షల 17వేల 366కు చేరుకుంది.

Related Tags :

Related Posts :