లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Sports

రెండో వన్డేలో రొమాంటిక్ సీన్.. చప్పట్లు కొట్టిన ప్లేయర్లు

Published

on

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో రెండో వన్డే జరుగుతున్న సమయంలో ఓ లవ్ ట్రాక్ నడిచింది. క్రికెట్ స్టేడియాన్ని రొమాంటిక్ స్పాట్ గా మార్చేశారు. మ్యాచ్ చూడటానికి వచ్చిన ఇండియాన్ సపోర్టర్.. అదే మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆస్ట్రేలియన్ సపోర్టర్ కు లవ్ ప్రపోజ్ చేసేశాడు.

ఆమె వెంటనే ఓకే చెప్పేసి హగ్ చేసుకుని కిస్ ఇచ్చింది. ఇదంతా చూసిన ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ సైతం నవ్వుకుంటూ చప్పట్లు కొట్టి కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఇండియన్ క్రికెట్ అభిమానులకు 390పరుగుల లక్ష్యాన్ని చేధించలేక ఓడిపోవడంతో కాస్తంత నిరుత్సాహమే వచ్చింది.



ఈ సీన్ చూసిన వాళ్లంతా కాసేపు నవ్వుకుని రిలాక్స్ అయ్యారు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలోనూ ఓటమిని మూటగట్టుకున్న టీమిండియా సిరీస్‌ను దక్కించుకునే అవకాశం కోల్పోయింది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డేను గెలిచిన ఆసీస్‌.. రెండో వన్డేలో కూడా విజయం సాధించింది. 51 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా.. మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *