Home » ఫ్యామిలీలతో సహా ఆస్ట్రేలియా చేరుకున్న టీమిండియా
Published
2 months agoon
By
subhnటీమిండియా క్రికెటర్లు గురువారం ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఆస్ట్రేలియాలో ఇండియా పర్యటనలో భాగంగా ఫ్యామిలీలతో సహా బయల్దేరారు. వారుచేరుకున్న ఫొటోలను బీర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా(BCCI)సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసింది.
‘దుబాయ్ ఎయిర్‌ప్లేన్ సిడ్నీ హలో ఆస్ట్రేలియా! #TeamIndia అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్టు చేసింది. కుటుంబాలతో సహా సిడ్నీ చేరుకున్న ఫొటోలను యాడ్ చేసింది. క్రికెటర్లంతా కచ్చితంగా 14రోజుల క్వారంటైన్ లో ఉండాల్సిందే. ‘మా చిన్న ఆర్మీతో క్వారంటైన్ కు రెడీగా ఉన్నాం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది.
బుధవారం దుబాయ్ బయల్దేరుతున్న సమయంలో తీసిన ఫొటోలను పోస్టు చేసింది బీసీసీఐ. ప్లేయర్లంతా పీపీఐ కిట్లలో మాస్క్ లు ధరించి జర్నీ కోసం రెడీగా ఉన్నారు. రెండు నెలల పాటు జరగనున్న పర్యటనలో భాగంగా నవంబర్ 27నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగాల్సి ఉండగా ఇండియా తొలి సారి విదేశాల్లో డే అండ్ నైట్ టెస్ట్ మ్యాచ్ లు ఆడనుంది. నేషనల్ క్రికెట్ అకాడమీలో గాయం నుంచి కోలుకున్న ఇషాంత్ శర్మ ఫిట్నెస్ నిరూపించుకోవడానికి రెడీ అయ్యాడు.
ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ ఐదో ట్రోఫీ రోహిత్ శర్మ అందించిన రోహిత్.. పరిమిత ఓవర్ల క్రికెట్ కు దూరంగా ఉండనున్నాడు. సాహాది కూడా అదే పరిస్థితి. టీమిండియా అంతా కలిసి ఒకేసారి వెళ్లినప్పటికీ అతను మ్యాచ్ లకు కొద్ది కాలం వరకూ అందుబాటులో ఉండడని బీసీసీఐ తెలిపింది.