లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

నెల రోజుల ముందే మర్డర్ ప్లాన్ రెడీ…….

Published

on

Hyderabad Crime News హైదరాబాద్ లో జరిగిన హేమంత్ పరువు హత్యలో అవంతి తల్లి తండ్రులే విలన్లని తెలుస్తోంది, అవంతి హేమతం వివాహంతో అవమానంతో రగిలిపోయారు  ఆమె తల్లి తండ్రులు లక్ష్మారెడ్డి అర్చన. బావమరిది యుగంధర్ రెడ్డితో లక్ష్మారెడ్డి నెల క్రితమే ప్లాన్ చేసారు. హైదరాబాద్ లో జరిగిన హేమంత్ పరువు హత్య కేసులోని….రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. నెల ముందే.. హేమంత్‌ని చంపేందుకు.. ప్లాన్ వేసినట్లు నిందితులు వెల్లడించినట్లు తెలుస్తోంది.

తండ్రి లక్ష్మారెడ్డి, తల్లి అర్చన కలిసి మేనమామ యుగంధర్‌రెడ్డితో హత్యకు స్కెచ్ వేశారు. ఇందుకు కిరాయి హంతకులతో 10లక్షల రూపాయలు డీల్ కుదుర్చుకున్నారు. నెల ముందే యుగంధర్ సోదరులు రెక్కీ చేశారు. కిరాయి హంతకులు.. కృష్ణ, రాజు, పాషాతో.. యుగంధర్ పలుమార్లు చర్చలు కూడా జరిపాడు. మాయమాటలు చెప్పి అవంతిని తమ వైపు తిప్పుకోవాలని లక్ష్మారెడ్డి ప్లాన్ వేశాడు. నెలరోజులుగా.. అవంతని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేశారు. మాయమాటలు చెప్పి.. కాంప్రమైజ్ అని పిలిచి.. చివరికి హేమంత్‌ని హత్య చేశారు.


తల్లే విలన్
కూతురిని ఎంతో ప్రేమగా పెంచింది.. కానీ ఆ కూతురి ప్రేమను మాత్రం తట్టుకోలేకపోయింది. తను కాదన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఆమె జీర్ణించుకోలేకపోయింది. కూతురు అతనితో సంతోషంగా ఉంటుందని తెలిసినా.. వాళ్లని కాదని వెళ్లిపోయిందన్న కోపంతో ఆ తల్లి రగిలిపోయింది. రోజురోజుకు ఆమెపై కక్ష పెంచుకుంది. చివరికి కన్న కూతురికి పసుపు కుంకుమలు దూరం చేసి విలన్‌గా మారింది ఆ తల్లి.

హేమంత్ హత్య తెలంగాణరాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అవంతి, హేమంత్‌ జూన్‌లో రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ సమయంలో ఇరు కుటుంబసభ్యులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా అవంతి కుటుంబ సభ్యుల్లో మార్పు రాలేదు. తమ కూతురు ఇంత పని చేస్తుందా? అని కోపంతో ఊగిపోయారు. వేరే కులస్తుడిని వివాహం చేసుకుందని అవమానంతో రగిలిపోయారు. ఎలాగైనా వాళ్లని విడదీయాలనే నిర్ణయించుకున్నారు.


అక్క కళ్ళల్లో ఆనందం చూడటానికి
అవంతి ప్రేమ వివాహం చేసుకోవడం తల్లి అర్చన తట్టుకోలేకపోయింది. ఏం చేసైనా కూతురిని ఇంటికి తెచ్చుకోవాలనుకుంది. కూతురితో మాట్లాడి నచ్చజెప్పాలని చూసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో తన తమ్ముడు యుగంధర్‌ రెడ్డితో వద్ద తన గోడు వెళ్లబోసుకుంది. అవంతి చేసిన పనికి తన చెల్లి బాధ పడుతుండడం అతను చూడలేకపోయాడు. అవంతిని తీసుకొస్తేనే తన చెల్లి సంతోషంగా ఉంటుందని భావించాడు. అర్చన కళ్లల్లో ఆనందం చూసేందుకు అతను క్రిమినల్‌గా మారిపోయాడు.

ఫస్ట్ రెక్కీ, నెక్స్ట్ మర్డర్
హేమంత్‌, అవంతిని విడదీయాలని పక్కా ప్లాన్ వేశారు. నెల ముందే యుగంధర్ సోదరులు రెక్కీ చేశారు. ఫస్ట్ కిడ్నాప్, నెక్స్ట్ మర్డర్ స్కెచ్ గీశారు. ఇందుకు కిరాయి హంతకులు కృష్ణ, రాజు, పాషాతో డీల్ కుదుర్చుకున్నారు. అప్పటినుంచి అవంతిని తమ వైపు తిప్పుకోవాలని తండ్రి లక్ష్మారెడ్డి కూడా ప్రయత్నాలు జరిపాడు. మాయమాటలు చెప్పి.. కాంప్రమైజ్ అంటూనే హేమంత్ హత్యకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

హేమంత్ అవంతి కిడ్నాప్, హత్య
హేమంత్, అవంతి నివాసముంటున్న ఇంటికి కారులో వచ్చారు. తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఒకసారి వచ్చి మాట్లాడు అంటూనే తమ ప్లాన్ అమలు చేశారు. కేసులో ఏ1 నిందితుడు యుగంధర్‌ రెడ్డి.. హేమంత్, అవంతిలను బలవంతంగా కారులోకి ఎక్కించాడు. అయితే ఒకసారి అవంతికి నచ్చజెప్పాలని ప్రయత్నించాడు. హేమంత్‌ను వదిలేయటానికి అవంతి ఒప్పుకోకపోవడంతో అతన్ని చంపేశారు.


తన ప్రేమ కోసం అవంతి.. కూతురి మీద ప్రేమతో అర్చన.. చెల్లెలి ఆనందం కోసం యుగంధర్‌రెడ్డి.. ఇలా వీరు వేసిన అడుగుల్లో అమాయకుడైన హేమంత్ బలైపోయాడు. కూతురి ప్రేమను ఆ తల్లి అర్థం చేసుకుంటే.. ఇక్కడి వరకు వచ్చేది కాదేమో. అలాగే చెల్లి కన్నీళ్లను చూసిన క్రిమినల్‌గా మారిన యుగంధర్‌.. ఒక్కసారి ఆలోచించి ఉంటే హేమంత్‌ బతికి ఉండేవాడేనని అనుకుంటున్నారు.

ముగిసిని హేమంత్ అంత్యక్రియలు
పరువు హత్యలో దారుణహత్యకు గురైన హేమంత్ మృతదేహానికి అంత్యక్రియలు సెప్టెంబర్26  శనివారం ముగిశాయి. గుండెలవిసేలా రోధించిన హేమంత్ భార్య అవంతిని చూసి అక్కడి వారు కన్నీరుమున్నీరయ్యారు. ఇక అతని తల్లి తన కొడుకు కన్నా ముందు తనను పాడెమీద పడుకోబెట్టండి అంటూ హేమంత్ తల్లి అడ్డుపడేసరికి అక్కడివారు అడ్డుకున్నారు.

పెళ్లయి సంతోషంగా గడుపుతున్న అన్నా, వదిన జీవితాలలో కులం చిచ్చు పెడుతుందనుకోలేదని హేమంత్ తమ్ముడు సుమంత్‌ బావురుమన్నాడు. మూడు నెలల క్రితమే అన్నయ్య పెళ్లి వార్త విన్న తాను.. ఈరోజు అన్న చావు కబురు వినాల్సి వస్తుందనుకోలేదంటూ వదినని పట్టుకుని బోరుమని విలపిస్తుంటే అక్కడవారి గుండెలు తరుక్కుపోయాయి.


తనకే ఇంత బాధ ఉంటే అన్నతో జీవితాన్ని పంచుకోవాలని కోటి ఆశలతో అడుగుపెట్టిన వదిన అవంతి పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని సుమంత్ ఆవేదన వ్యక్తం చేస్తుంటే..ఆ ప్రాంతమంతా విషాదంతో నిండిపోయింది.రెండు రోజులుగా హైదరాబాద్‌లోని చందానగర్‌లో హేమంత్ నివాస ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి.

ఎనిమిదేళ్ళ ప్రేమ పరువు హత్యకు దారి తీసింది
ఎనిమిదేళ్ల ప్రేమపై పరువు పడగ విప్పి నిండు ప్రాణాన్ని బలితీసుకోవడంతో..ఆ ఇంట్లో ప్రతిఒక్కరూ గంపెడు విషాదంతోనే గడుపుతున్నారు. పరువు హత్యో.. కులగజ్జో.. అంతస్థుల్లో బేధమో కారణం ఏమైనా ఓ తండ్రి ఉన్మాదం బుసకొట్టి.. పెళ్లి జరిగి మూడునెలలు కాకముందే .. కూతురి పసుపు కుంకాలను దూరం చేసేలా చేసింది.


ఆధునిక శాస్త్ర సాంకేతిక ప్రపంచం గుప్పెట్లోకి వచ్చినా…… మానవ సంబంధాల్లోని బూజు మాత్రం తొలగిపోలేదని నిరూపించింది. మనిషితనం అదేపనిగా మాయమవుతూనే ఉందని గుర్తుచేస్తోంది. హేమంత్‌ హత్య మరోసారి అత్యంత అమానవీయమైన కుల ఉన్మాదాన్ని చాటింది. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్న అవంతి, హేమంత్‌లు.. మైనారిటీ తీరి మేజర్‌లయ్యారు.

కులాలు వేరైనా మనస్సులు కలవడంతో పెళ్లితో ఒక్కటయ్యారు. ఇదే అవంతి కుటుంబానికి మింగుడుపడలేదు. అల్లుడిని చంపి కసిని తీర్చుకున్నాడు అవంతి తండ్రి లక్ష్మారెడ్డి. కుమార్తె చేసిన పనికి పరువు పోయిందంటూ లక్ష్మారెడ్డి, అర్చన తరచూ బంధువులతో అంటుండేవారు.


సెప్టెంబర్ 20న అవంతి మేనమామ యుగంధర్‌రెడ్డి ఇంటికొచ్చినప్పుడు ఈ విషయంపై చర్చించుకున్నారు. హేమంత్‌ను చంపేయడమే పరిష్కారమని భావించారు. రూ.10 లక్షలు ఖర్చు పెడితే ఆ పని పూర్తవుతుందని యుగంధర్‌రెడ్డి చెప్పాడు. వాళ్లు సరేనని.. అప్పటికప్పుడు రూ.లక్ష ఇచ్చారు. యుగంధర్‌రెడ్డి నేరుగా వట్టినాగులపల్లికి వెళ్లి అక్కడ బిచ్చు యాదవ్‌, ఎరుకల కృష్ణ, లడ్డూ అలియాస్‌ మహమ్మద్‌ పాషాను కలిశాడు. రూ.10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. అడ్వాన్స్‌గా బిచ్చూ యాదవ్‌కు రూ.3వేలు, కృష్ణకు రూ.20వేలు, లడ్డూకు రూ.5వేలు ఇచ్చాడు. పని పూర్తవగానే మిగిలింది ఇస్తానన్నాడు.

ప్లాన్ అమలు చేసిందిలా….
టీఎన్జీవోస్‌ కాలనీలోని హేమంత్‌ ఇంటి వద్ద.. బిచ్చుయాదవ్‌ గ్యాంగ్‌ రెక్కీ నిర్వహించింది. ఈనెల 24న హేమంత్‌ను కిడ్నాప్‌ చేసి హత్య చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంది. లక్ష్మారెడ్డి దగ్గర 20 ఏళ్లుగా సాహెబ్‌ పటేల్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాత అతడు బైకుపై టీఎన్జీవోస్‌ కాలనీకొచ్చాడు. హేమంత్‌, అవంతి ఇంట్లోనే ఉండడంతో.. ఆ సమాచారాన్ని యుగంధర్‌రెడ్డికి చెప్పాడు. మధ్యాహ్నం రెండు, రెండున్నర గంటల మధ్యలో మూడు కార్లలో 15 మంది అక్కడికొచ్చారు. నువ్వింటికి రా.. మీ నాన్నను ఒప్పిద్దామంటూ అవంతిని బలవంతం చేశారు.


తన భర్తను కూడా తీసుకెళ్దామంటేనే తాను వస్తానంటూ ఆమె షరతు విధించింది. భర్తతో కలిసి అవంతి తన తల్లి ఉన్న కార్లో ఎక్కింది. అంతకు ముందే ఇక్కడ జరుగుతున్న విషయాన్ని హేమంత్‌ తన తండ్రి మురళీకృష్ణకు ఫోన్‌ చేసి చెప్పాడు. ముందు వెళ్తున్న రెండు కార్లను యుగంధర్‌రెడ్డి అనుసరించాడు.

కారులోంచి దూకేసిన హేమంత్, అవంతి
గోపన్‌పల్లి చౌరస్తా వద్ద కార్లు చందానగర్‌ వైపు కాకుండా వట్టినాగులపల్లి వైపు వెళ్తుండటంతో అవంతి, హేమంత్‌కు అనుమానమొచ్చి అదును చూసి బయటకు దూకేశారు. అయితే యుగంధర్‌రెడ్డి.. హేమంత్‌ను బలవంతంగా తన కారులో ఎక్కించుకున్నాడు. వాహనాన్ని వేగంగా వట్టినాగులపల్లి వైపు పోనిచ్చాడు. కారులో బిచ్చూయాదవ్‌, కృష్ణ, లడ్డూ ఉన్నారు. అవంతి తన మామ మురళీకృష్ణకు ఫోన్‌ చేసింది. ఆయన 100కు ఫోన్‌ చేసి పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *