అయోధ్య భూమి పూజ..32 సెకన్ల ముహూర్తం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అందరి చూపు అయోధ్య వైపు నెలకొంది. కోట్లాను మంది ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టం కాసేపట్లో ప్రారంభం కానుంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరుగనుంది. భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ పూజా కార్యక్రమం పాల్గొననున్నారు. భూమి పూజ కేవం 32 సెకండ్లలో పూర్తి కానుంది. అసలైన భూమి పూజ మధ్యాహ్నం 12.44కి మొదలై..12.45 లోపలే ముగుస్తుందని తెలుస్తోంది.శ్రీరామచంద్ర స్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంనే ఫిక్స్ చేశారు. అంత తక్కువ సమయంలో పూర్తయ్యే ఈ కార్యక్రమాన్ని చూసేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. 40 కేజీ వెండి ఇటుకను పునాది రాయిగా వేస్తున్నారు. భూమి పూజా కార్యక్రమం సందర్భంగా అయోధ్యలో మోడీ మూడు గంటల పాటు ఉండనున్నారు.

2020, ఆగస్టు 05వ తేదీ ఉదయం ఢిల్లీ నుంచి 10.30కి బయలుదేరారు. 10.30కి లక్నో ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. 11.30కి అయోధ్య చేరుకున్న అనంతరం 11.40కి మోదీ..హనుమాన్ గర్హీ ఆలయాన్ని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు చేస్తారు. రామజన్మ భూమి కాంప్లెక్స్ చేరుకుని రామ్ లల్లా విరాజ్ మాన్ కి పూజ చేస్తారు.మధ్యాహ్నం 12.10కి ప్రధాని మోడీ పారిజాత మొక్కను నాటుతారు. భూమి పూజ కార్యక్రమం 12.45కి ముగుస్తుంది. తిరిగి లక్నోకి చేరుకుని..మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఢిల్లీకి బయలుదేరుతారు.


Related Posts