Ayodhya countdown begins Modi Tweet

అయోధ్యపై నిర్ణయమేదైనా..సయోధ్యను విస్మరించరాదు – మోడీ ట్వీట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అయోధ్యపై నిర్ణయమేదైనా..సయోధ్యను విస్మరించరాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం ఒక ముగింపుకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి – బాబ్రీ మసీదు వ్యాజ్యంపై తుది తీర్పు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. 2019, నవంబర్ 09వ తేదీ శనివారం ఉదయం 10.30కి ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరిస్తుంది. ఈ సందర్భంగా మోడీ ట్వీట్ చేశారు. 

‘సుప్రీంకోర్టు అయోధ్య కేసులో ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించినా..దానిని ఏ ఒక్క వర్గానికో గెలుపు ? లేదా ఓటమి ? అనే కోణం నుంచి చూడనే కూడదు. శాంతి సామరస్యాల పరిరక్షణణ, సుహృద్బావం అనేది మన సుసంపన్న సంప్రదాయం. అయోధ్యపై సుప్రీంకోర్టు నిర్ణయం ఈ అత్యున్నత సంప్రదాయాన్ని మరింత పరిపుష్టం చేసేలా చూడడం మనందరి ప్రప్రథమ ప్రాధాన్యం కావాలి. దేశ ప్రజలందరికీ అదే నా అభ్యర్థన. తీర్పు అనంతరం కూడా మైత్రి, సయోధ్యలను చక్కగా కాపాడుకోవాలి. సాంస్కృతిక సంస్థలు గత కొన్ని రోజులుగా ఎంతో కృషి చేస్తున్నాయి. సర్వోన్నత న్యాయస్థానంలో ఈ కేసు విచారణ..జరిగినంత కాలం..సమాజంలోని అన్ని వర్గాలూ సుహృద్బావ పరిస్థితులు కొనసాగేలా చేసిన కృషి అభినందనీయం’ అని ట్వీట్ చేశారు మోడీ. 
Read More : అయోధ్య తీర్పు : హైదరాబాద్‌లో బలగాల మోహరింపు
> అయోధ్యపై సుప్రీంకోర్ట్‌ తుది తీర్పు
> ఉదయం 10.30కు వెల్లడించనున్న ధర్మాసనం
> ఐదుగురు సభ్యుల ధర్మాసనానికి భద్రత పెంచిన ప్రభుత్వం
> జస్టిస్ రంజన్ గొగొయ్‌కు జెడ్ కేటగిరీ భద్రత
> అయోధ్యలో స్థల వివాదంపై నాలుగు సివిల్‌ దావాలు
> వివాదానికి కేంద్ర బిందువుగా ఉన్న 2.77 ఎకరాల భూమి
> 2010లో అలహాబాద్‌ హైకోర్టు కీలక తీర్పు
> ముగ్గురు కక్షిదారులు సమానంగా పంచుకోవాలని గతంలో తీర్పు
> అలహాబాద్‌ హైకోర్ట్‌ తీర్పును సవాల్‌ చేస్తూ 14 పిటిషన్లు
> అలహాబాద్‌ హైకోర్ట్‌ తీర్పుపై 2011 మేలో స్టే ఇచ్చిన సుప్రీంకోర్ట్‌
> 2019 మార్చి 8న మధ్యవర్తిత్వ కమిటీ నియామకం
> పరిష్కారం చూపలేక చేతులెత్తేసిన మధ్యవర్తుల కమిటీ
> ఆగస్టు 6 నుంచి అక్టోబర్‌ 16 వరకూ సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ
> 40 రోజులపాటు విచారణ జరిపిన ధర్మాసనం

Related Posts