‘అయుథ్తయ’ జంబూ ద్వీపంలో మరో అయోధ్య..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్ లోని సరయు నదీ తీరంలోనే అయోధ్య గురించి మనకందరికీ తెలిసిందే. దశాబ్దాల తరబడి కోట్లాదిమంది ఎదురు చూస్తున్న శుభతరుణం అయోధ్యలో రామ మందిర నిర్మాణం. రామమందిర నిర్మాణ భూమి పూజ మరికొద్ది గంటల్లో ప్రారంభంకానుంది. ఈ శుభ తరుణంలో మన భారత దేశంలోనే కాకుండా మరో ప్రాంతంలో ఉండే అయోధ్య గురించి తెలుసుకుందాం..

జంబూ ద్వీపంలో కూడా మరో అయోధ్య ఉంది. ఆ నగరానికి కూడా శతాబ్దాల చరిత్ర ఉంది. భారతదేశంలోని అయోధ్యను శ్రీరాముడి వంశం అయిన రఘువంశం పాలించింది. అదే జంబూ ద్వీపంలోని అయోధ్యను కూడా ఓ రాజవంశం పరిపాలించింది. చాలామందికి తెలియని ఈ జంబూ ద్వీపం చరిత్ర గురించి తెలుసుకుందాం..

రామ భక్తులకు కూడా తెలియని రామ రాజ్యం అది. అదే యూపీకి 3 వేల 500 కిలో మీటర్ల దూరంలో ఉన్న థాయ్ లాండ్ రాజధాని బ్యాంక్ కాక్ లో ఉంది ఈ రెండో అయోధ్య. బ్యాంకాక్ కు కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రెండో అయోధ్య. బ్యాంకాక్ లో ఉన్న ఈ అయోధ్య గురించి ప్రధాని నరేంద్రమోడీ బ్యాంకాక్ వెళ్లినప్పుడు ఓ సమావేశంలో మాట్లాడారు.

థాయ్ లాండ్ లోని ఈ అయోధ్యలో ఉన్న ఓ బోర్డుపై ఇది శ్రీరామ జన్మ స్థలం అని రాసి ఉంటుంది. థాయ్ లాండ్ లో ఉన్న ఈ అయోధ్యను ‘అయుథ్తయ’ అని అంటారు.థాయ్ లాండ్ ప్రాచీన రాజధాని పేరు ‘అయుథ్తయ’. భారత్ లో మొఘలాయిల పాలన ప్రారంభం కాక ముందే థాయ్ లాండ్ లో రాముడ్ని స్మరించేవారు. పూజించేవారు. ఆరాధించేవారు. అనాటే ఈ అయెధ్య వెలసింది.

భారత్ లోని అయోధ్యకు ఈ అయోధ్యకు సంబంధాలున్నాయి. భారత్ కు 3వేల 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయ్ లాండ్ లో రామనామం మారుమ్రోగుతోంది. ఇప్పటికీ థాయ్ లాండ్ ప్రజల గుండెల్లో రాముడున్నాడు. భారతదేశపు ప్రాచీనత్వానికి థాయ్ లాండ్ లోని అయోధ్య నిలువెత్తు నిదర్శనంగా ఉంది.

800 ఏళ్లనాటి నుంచి బ్యాంకాక్ లో ఉన్నఅయోధ్యకు చరిత్ర ఉంది. ఆనాటినుంచి రాముడికి సంబంధంచిన ఎన్నో ఆనవాళ్లు చరిత్రకు ఆనవాళ్లుగా ఈనాటికి కనిపిస్తున్నాయి. ఈ ఆనవాళ్లు శతాబ్దాలుగా భారత్ కు థాయ్ లాండ్ కు మధ్య ఉన్న సాంస్కృతిక వైభవాన్ని చాటిచెబుతున్నాయి.

థాయ్ లాండ్ లోని అయోధ్యను ఏలిన రాజుల పేర్లు ‘రాము’అనే పదంతోనే ఉన్నాయి. ఈప్రాచీన అయోధ్యాపురిలో ఎటు చూసినా ప్రాచీన భారతీయ సంస్కృతి కనిపిస్తుంటుంది.
భారతీయ సంస్కృతి సంప్రదాయాల గురించి అయోధ్య గురించి పలువురు ఎన్నో పరిశోధనలు చేశారు.

READ  అయోధ్య అంటే... ఒక్క రామమందిరమేనా?

పృధ్వీరాజ్ థవన్ అనే ఓ ప్రవాస భారతీయుడు మాట్లాడుతూ..బ్యాంకాక్ అయెధ్యను పరిపాలించిన రామా-1 రాజు చరిత్ర గురించి తనకు బాగా తెలుసని అతను రాముడి గురించి తెలుసుకని చాలా ప్రభావితుడయ్యాడని 50వేలకు పైగా పద్యాలతో రామాయణాన్ని రాశారని వాటిని నాలుగు భాగాలుగా ప్రింట్ చేయించారని తెలిపారు.

థాయ్ లాండ్ లోని అయోధ్యను పాలించిన రాజుల్లో రామా 10 రాజు ఇటీవల భారతదేశంలో కూడా పర్యటించారు. ఈ రాజుల భవనాన్ని కూడా థార్మి స్థలంగా ఈనాటికి అక్కడి ప్రజలు భావిస్తున్నారు. ప్రతీ రోజు ఈ రాజభవనాన్ని ప్రజలు సందర్శించేందుకు వస్తారు. రాజుల చిత్రాలను రాజ భవనాన్ని చూడటానికి వారి చరిత్రతో పాటు శ్రీరాముడు గురింంచి కూడా ఆసక్తిగా తెలుసుకుంటుంటారు థాయ్ లాంట్ ప్రజలు.Related Posts