లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

india

త్రివర్ణ పతాకం ఎగరేసి అయోధ్య మసీదు పని ప్రారంభం

Published

on

Ayodhya Mosque: ఇండియా 72వ రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి.. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో మసీదు నిర్మాణం మొదలుపెట్టారు. 2019లో సుప్రీం కోర్టు నిర్దేశించిన స్థలంలోనే నిర్మించేందుకు పనులు మొదలుపెట్టారు.

ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు.. అయోధ్యలోని ఐదు ఎకరాల స్థలంలో మసీదు కట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 8గంటల 15నిమిషాలకు.. రామ్ మందిర నిర్మాణానికి 25కిలోమీటర్ల దూరంలో మసీదు కట్టనున్నారు. ఈ సందర్భంగా 8గంటల 45నిమిషాలకు జాఫర్ అహ్మద్ ఫారూఖీ జెండా ఎగరేశారు.

‘ట్రస్టు సభ్యులంతా కలిసి ఓ మొక్కను నాటి నిర్మాణం మొదలుపెట్టాలని నిర్ణయించారు. మట్టి స్వభావం గురించి పరీక్షలు జరుపుతున్నాం. ఆ రిపోర్టులు వచ్చాక పనులు స్టార్ట్ చేస్తాం. దీని కోసం ఇప్పటికే విరాళాల సేకరణ మొదలుపెట్టాం’ అని ఫారూఖీ అన్నారు.

గత నెల ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ (ఐఐసీఎఫ్) మసీదుకు సంబంధించిన డిజైన్ ను ప్రకటించింది. గ్లాస్ డోమ్ తో.. చుట్టూ గార్డెన్ తో నిర్మాణం ఉంటుందని అందులో చూపించారు. మసీదు పేరు ఇంకా నిర్ణయించాల్సి ఉంది. ఏ చక్రవర్తి పేరు, రాజు పేర్లను పెట్టదలచుకోలేదని ట్రస్ట్ చెప్తుంది.

మసీదుతో పాటు హాస్పిటల్ కూడా ఉండేలా తొలి దశ నిర్మాణం జరుగుతుంది. ఆ తర్వాత హాస్పిటల్ ను విస్తరిస్తాం.

ఈ హాస్పిటల్ కాంప్లెక్స్ లో రోజూ కమ్యూనిటీ కిచెన్, వెయ్యి మందికి భోజనం ఉండేలా చూస్తున్నాం. ఇక్కడ ఉన్న 25నుంచి 30కిలోమీటర్ల వ్యాసార్థంలోని మెడికల్ సౌకర్యాలపై సర్వే చేశాం. అని ట్రస్ట్ సెక్రటరీ అన్నారు.