లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

వెండి ఇటుకలతో బ్యాంకు లాకర్లు నిండిపోయాయి..ఇక పంపిచొద్దు : రామ మందిరం ట్రస్టు

Published

on

donate silver bricks Says Bank Lockers Out of Space : అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు భారీ స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి. బంగారం, వెండి, ఇత్తడి, నగదు ఇలా భక్తులు ఎవరికి తోచినవి వారు విరాళాలుగా ఇస్తున్నారు. అలా ఇచ్చిన విరాళాలు ఇప్పటికే రూ. 1,500 కోట్లు దాటిపోయాయి. అలాగే ఎంతోమంది భక్తులు 400 కేజీలకు పైగా వెండి ఇటుకలు పంపించారు. అవి ట్రస్టుకు అందాయి.

అలా భక్తులు పంపించిన వెండి ఇటుకల్ని రామమందిరం ట్రస్టు భద్రత కోసం బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తోంది. దీంతో బ్యాంకు లాకర్లన్నీ వెండి ఇటుకలతో నిండిపోయాయని ఇక భక్తులు వెండి ఇటుకల్ని పంపించ వద్దని రామ మందిర ట్రస్టు తెలిపింది. వెండి ఇటుకలతో ఇప్పటికే బ్యాంకు లాకర్లు నిండిపోయాయని… ఇకపై అందే ఇటుకలను భద్రపరచటానికి స్థలం లేదని ట్రస్టు ప్రకటించింది. దీంతో ఇకపై భక్తులెవ్వరూ వెండి ఇటుకలను ఎవరూ పంపించవద్దని కోరింది.

మందిర నిర్మాణంలో ఉపయోగించేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు ఇటుకలను పంపుతున్నారని ట్రస్టు తెలిపింది. ఇటుకలతో లాకర్లు కూడా నిండిపోయాయని… వాటిని భద్రపరచడంపై ఆందోళనకు గురవుతున్నామని తెలిపింది.

విరాళాలు ఇవ్వాలనుకుంటున్న భక్తులు ఇక వెండి రూపంలో కాకుండానగదు, చెక్కు రూపాల్లో ఇవ్వాలని కోరింది. మందిర నిర్మాణం ఇంకా ప్రారంభ దశలోనే ఉందని… ఈ సమయంలో మెటల్ రూపంలో విరాళాలు అవసరం లేదని తెలిపింది.