అయోధ్య రామమందిరం డిజైన్ గురించి తెలుసా.. దశాబ్దాల పాటు చెక్కు చెదరకూడదని ఇలా..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కోట్లాది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముని ఆలయ నిర్మాణం కోసం దశాబ్దాల తరబడి జాప్యం జరిగినా..ఆ లోటు తీరేలా భవ్య రామాలయం నిర్మితం కాబోతోంది. అందుకే 32ఏళ్ల నాటి డిజైన్‌లో కూడా మార్పులు చేశారు. భక్తుల రద్దీని మాత్రమే కాదు. మరో వెయ్యేళ్లైనా చెక్కు చెదరని రీతిలో నిర్మించేందుకు హైందవ సంప్రదాయం వినువీధిలో గర్వంగా నిలిచేందుకు వీలుగా నూతన ఆకృతులను కూడా చేర్చుతున్నారు.

రామమందిర శిఖరాల్లో మార్పులు చేయకుండానే.. మరో రెండు మండపాలను కూడా చేర్చినట్లు ఆలయ ప్రధానశిల్పి ప్రకటించారు. మొత్తంగా ఆకాశం మీదుగా చూస్తే.. రామాలయం పూర్తిగా ఆదిశేష నమూనాలో కన్పించనుండటం విశేషం. మొదటి అంతస్థులో రామచంద్రుడు కొలువు దీరనుండగా.. రెండో అంతస్థులో రామ్ దర్బార్ నిర్మిస్తారు. ఆ పైన ఉండే మూడో అంతస్థును ఇతర అవసరాల కోసం నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది

రామాలయంలో ప్రవేశించే భక్తులకు పూర్తిగా ఆధ్యాత్మిక భావనతో పాటు.. భగవంతునిపైనే ఏకాగ్రత కేంద్రీకృతమయ్యేలా ఆలయ నిర్మాణం సాగనుంది. వాస్తుశాస్త్రంతో పాటు భక్తుల భావాలను కూడా ప్రభావితం చేసేలా రామమందిరం నిర్మించనున్నారు. ముందుగా అనుకున్న మూడు మండపాలకు మరో రెండు కొత్త మండపాలు కూడా చేరడం ఇందుకు నిదర్శనం..

రాబోయే కాలంలో ఈ అత్యద్భుత ఆలయం భక్తులకు నిజమైన అయోధ్య అనే భావన కలగడమే ముఖ్య ఉద్దేశంగా గుడి నిర్మాణం సాగబోతోంది. మూడు మండపాలలో రంగ్ మండప్, నృత్య మండప్, గుడ్ మండప్‌లు ఉండనున్నాయి. ఇక్కడ్నుంచి గర్భ గృహానికి దారి తీసే మార్గంలో ఎలాంటి వెలుగు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దైవ దర్శనం దగ్గర పడే కొద్దీ పరిసరాల్లో వెలుతురు తగ్గుతూ.. కేవలం దేవుని ప్రతిమపైనే వెలుగొందుతూ ఉండేలా గర్భగుడిని నిర్మిస్తారు.

భక్తుల దృష్టి పూర్తిగా భగవంతునిపై నిలపడమే ఇందులోని పరమార్ధమని శిల్పులు చెప్తున్నారు. ప్రధానమంత్రి మోడీ భూమిపూజతో ప్రారంభమయ్యే ఆలయ నిర్మాణం.. ఆ తర్వాత ఎక్కడా బ్రేక్ లేకుండా.. పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు.. ఐతే ఎంత వేగంగా పూర్తి చేసినా.. భవ్య రామాలయం పూర్తయ్యేందుకు కనీసం మూడేళ్ల సమయం పడుతుందని అంచనా… ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి ఆధ్వర్యంలో నిర్మాణపనులు సాగనున్నాయి.

మరోవైపు ఎన్నో దశాబ్దాల ఎదురుచూపులు.. కోర్టు తీర్పులు.. సుదీర్ఘ పోరాటం తర్వాత గుడి నిర్మితం కానుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌లోనే భూమిపూజ చేయాలని ప్రధాని మోడీ ముందుగా అనుకున్నా… ఇదో చరిత్రాత్మక సందర్భం కావడంతో..స్వయంగా హాజరు కావడానికే నిర్ణయించుకున్నారు.

Related Posts