https://youtu.be/FU6xGZDpMaI

అయోధ్య తుది తీర్పు : ఆ భూమి రాముడిదే.. రామ న్యాస్‌కే అప్పగింత

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజకీయాలు, చరిత్రలకు అతీతంగా న్యాయం నిలబడాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. తీర్పును చీఫ్ జడ్జి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చదివి వినిపించగా.. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందినదని, వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కు కోరలేదని స్పష్టం చేశారు.

ప్రార్థనా మందిరాల చట్టం ప్రాథమిక విలువలు, మత సామరస్యాన్ని పరిరక్షిస్తుందని వెల్లడించారు. వివాదాస్పద స్థలంలో మందిరం ఉన్నట్టు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని అన్నారు. ఈ విషయంలో రామ్‌లల్లా, విరాజ్‌మాన్‌లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. మసీదు ఎవరు కట్టారో.. ఎప్పుడు కట్టారో స్పష్టం కాలేదని హైకోర్టు చెప్పిందని సుప్రీం న్యాయమూర్తి గోగోయ్ చెప్పారు.

ఆయోధ్యను రాముడి జన్మభూమిగా భావిస్తారని, ఈ విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేదని జస్టిస్ గొగొయ్ అభిప్రాయపడ్డారు. నమ్మకం, మత విశ్వాసాలు ఆధారంగా తీర్పు ఇవ్వలేమని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోవని ఉద్ఘాటించారు. న్యాయసూత్రాల ఆధారంగా భూ యాజమాన్య హక్కులు నిర్ణయించాలని అన్నారు.

వివాదాస్పద స్థలాన్ని పంచే ప్రసక్తేలేదని, మసీదు నిర్మాణం కోసం వేరే స్థలం కేటాయించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అయోధ్యలోనే ఐదు ఎకరాలు ముస్లింలకు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయోధ్య ట్రస్ట్‌కు మూడు నెలల్లోగా భూమిని అప్పగించాలని తీర్పు ఇచ్చింది ధర్మాసనం. వివాదాస్పద స్థలాన్ని రామ జన్మభూమి న్యాస్‌కు అప్పగించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

Related Posts