ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ టాప్ లో అయోధ్యతీర్పు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యావత్ భారతం దశాబ్దాలుగా ఎదురుచూసిన చారిత్రాత్మక అయోధ్య తీర్పును ఇవాళ(నవంబర్-9,2019)ఉదయం సుప్రీంకోర్టు వెలువరించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇవాళ అయోధ్య తీర్పు టాప్ ట్రెండింగ్ గా మారింది. ఇవాళ భారత్ లో,ప్రపంచవ్యాప్తంగా అయోధ్య తీర్పు హ్యాష్ ట్యాగ్, రామ్ మందిర్ ప్రారంభం హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇవాళ ఇదే ట్రెండింగ్ గా మారింది. 6లక్షల ట్వీట్లతో భారత్ లో,ప్రపంచంలో.. అయోధ్యతీర్పు హ్యాష్ ట్యాగ్ టాప్ ట్రెండ్ లో కొనసాగుతోంది. ప్రపంచంలోని టాప్ 10 ట్రెండింగ్ టాపిక్‌లలో ఐదు, భారతదేశంలోని మొత్తం 10 టాపిక్స్ ఈ తీర్పుకు సంబంధించినవే కావడం విశేషం.

భారత్ లో… అయోధ్య జడ్జిమెంట్ హ్యాష్ ట్యాగ్,రామ్ జన్మభూమి హ్యాష్ ట్యాగ్,బాబ్రీ మసీద్ హ్యాష్ ట్యాగ్ లు టాంప్ ట్రెండ్ లో ఉండగా, దాదాపు 2లక్షల ట్వీట్లతో రామ్ మందిర్ హ్యాష్ ట్యాగ్ ఈ లిస్ట్ లో సెకండ్ హైయస్ట్ గా ఉంది. 2లక్షలకు పైగా ట్వీట్లతో సుప్రీంకోర్టు హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది.

రంజన్ గొగొయ్ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. అయోధ్య తీర్పునిచ్చిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగధర్మాసనాన్ని లీడ్ చేసింది సీజేఐ రంజన్ గొగొయ్ అన్న విషయం తెలిసిందే. దాదాపు 40వేల ట్వీట్లతో హిందూముస్లింభాయిభాయి హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్ లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ లో ఉన్నఐదింటిలో నాలుగు అయోధ్య తీర్పుకి సంబంధించినవే.

Related Posts