Baaghi 3 - Official Trailer

మా అన్న జోలికొస్తే జాతరే – గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘బాఘీ 3’ ట్రైలర్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సెస్‌తో ‘బాఘీ 3’ థియేట్రికల్ ట్రైలర్..

బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కెరీర్‌ని మలుపు తిప్పాయి ‘బాఘీ’, ‘బాఘీ 2’ చిత్రాలు. ఇప్పుడు ‘బాఘీ’ ఫ్రాంచైజీలో భాగంగా ‘బాఘీ 3’ రానుంది. టైగర్ ష్రాఫ్, రితేశ్ దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్, అంకిత లోఖండే ప్రధాన పాత్రధారులుగా అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో సాజిద్ నడియాడ్‌వాలా గ్రాండ్ సన్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సాజిద్ నడియాడ్‌వాలా నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్.. ‘బాఘీ 3’ ట్రైలర్ తాజాగా విడుదల చేశారు.

‘నా జోలికొస్తే వదిలేస్తాను కానీ, మా అన్న జోలికొస్తే మాత్రం ఊరుకోను’ అంటూ తన స్టైల్ అద్భుతమైన ఫైట్ సీక్వెన్సె‌స్‌తో చెలరేగిపోయాడు టైగర్. ఉగ్రమూక ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) కిరాతక దురాగతాలతో.. నిత్యం బాంబుల వర్షంతో మోతమోగే సిరియాలో ప్రజల బతుకు ఎంత దుర్భరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే.

అలాంటి దేశంలో టెర్రరిస్టుల చేతికి చిక్కిన తన సోదరుడిని కాపాడుకునేందుకు హీరో చేసిన పోరాటం నేపథ్యంలో తెరకెక్కిన ‘బాఘీ 3’ ట్రైలర్ హాలీవుడ్ సినిమా రేంజ్‌లో ఉంది. ఒళ్లు గగుర్పొడిచే టైగర్ ఫీట్స్, కళ్లు చెదిరే విజువల్స్, అదిరిపోయే ఆర్ఆర్ ట్రైలర్‌లో హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘బాఘీ 3’ చిత్రాన్ని మార్చి 6న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.
 

Related Posts