Baahubali Cinema Dialogues In HighCourt

హైకోర్టు వ్యాఖ్యలు : రియల్ లైఫ్ విలన్లు ఇలాగే ఉంటారు బాహుబలి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్: టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్ కేసు విచారణలో హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కోర్టులో సినిమా డైలాగులు వినిపించాయి. న్యాయమూర్తుల నోట బాహుబలి సినిమా పేరు వినిపించింది. రీల్ లైఫ్‌లో విలన్లను ఎదుర్కొన్న బాహుబలి.. రియల్ లైఫ్‌లో విలన్లతో తలపడే అవసరం ఉండరని కోర్టు అభిప్రాయపడింది. రాయదుర్గంలోని తన గెస్ట్ హౌజ్ సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరిపింది. సామాన్యుడి విషయంలో అయితే ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేవాళ్లమంది. ప్రభాస్ విషయం కాబట్టి ఆచూతూచి వ్యవహరిస్తున్నామని, తీర్పు ఇచ్చే విషయంలో కొంత జాప్యం చేస్తున్న మాట వాస్తవమేనని కోర్టు చెప్పింది.
ప్రభాస్ భూకబ్జాదారుడు కాదు:
హీరో ప్రభాస్ భూకబ్జాదారుడన్న ప్రభుత్వ లాయర్ కామెంట్స్‌పై కోర్టు తీవ్ర అభ్యంతరం చెప్పింది. ప్రభాస్ విషయంలో ఆచితూచి వ్యవహారించాలని సూచించింది. ప్రభాస్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే ఆ భూమిని కబ్జా చేసిన వాళ్లూ అర్హులవుతారని ప్రభుత్వ లాయర్ వాదించారు. కొనుగోలు చేసిన భూమిలోనే ప్రభాస్ గెస్ట్ హౌజ్ కట్టుకున్నాడని, ప్రభాస్ ఎలాంటి తప్పు చేయలేదని అతడి తరఫు లాయర్ వాదనలు వినిపించాడు. రెవెన్యూ అధికారులు ఎలాంటి ముదస్తు నోటీసులు ఇవ్వకుండా సీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రభాస్ లాయర్ అడిగారు. గతంలో ఆ స్థలం రెగులరైజేషన్ కోసం ప్రభాస్ పెట్టుకున్న పిటిషన్‌ను తిరస్కరించాము అని ప్రభుత్వ లాయర్ చెప్పారు. దీన్ని కోర్టు తప్పు పట్టింది. రెగులరైజేషన్ పిటిషన్‌ను వెనక్కి తిప్పి పంపారు తప్ప తిరస్కరించలేదు అనే విషయాన్ని గుర్తు చేసింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ కేసులో కోర్టు తీర్పు ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
వివాదం ఇదే:
రాయదుర్గంలోని పాన్‌మక్తాలో సర్వే నెంబర్ 46లో 2వేల 80గజాల స్థలంలో ప్రభాస్ గెస్ట్ హౌజ్ నిర్మించుకున్నాడు. అయితే ఇది ప్రభుత్వ భూమి అని సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పు ఇచ్చింది. దీంతో ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. అక్కడ కట్టడాలను కూల్చేశారు. అక్కడే ఉన్న ప్రభాస్ గెస్ట్ హౌజ్‌ని సీజ్ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టుని ఆశ్రయించాడు.

 

Related Posts