లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఏనుగుపై యోగా చేస్తూ పడిపోయిన బాబా రామ్‌దేవ్

Published

on

యోగా గురు Baba Ramdev ఏనుగుపై యోగా చేస్తుండగా జారి కిందపడిపోయారు. ఈ ఘటనను అక్కడున్న వారు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. సోమవారం బాబా రామ్‌దేవ్ అతని శిష్యులకు యోగా ప్రాక్టీస్ గురించి బోధిస్తున్నారు.

మధురలోని గురు శరణన్ ఆశ్రమ్ రామానరాతి శిష్యులకు శిక్షణ ఇస్తున్నారు. యోగా ఆసనంలో కూర్చుని ఉండగా ఏనుగు ముందుకు కదిలింది. అంతే పట్టుకోల్పోయి కిందకు జారిపడ్డారు. వెంటనే పైకిలేచి నవ్వుకుంటూ వెళ్లిపోయారు. 22సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో వైరల్ అయింది.ఈ వీడియోకు 19వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. కాగా, వీడియోకు పలు రకాల రియాక్షన్స్ వస్తున్నాయి. ఒక యూజర్.. ‘చూడబోతే ఏనుగు యోగా సరిగా ప్రాక్టీస్ చేయనట్లుంది’ అని రాశాడు. మరో యూజర్.. ‘వెంటనే లేచి నిలబడగలిగాడు. అది బాబా రామ్‌దేవ్ అంటే’ అని రాశఆడు.

ఇంకొకరు ఆయన దూకేశారు పడిపోలేదని కామెంట్ చేశాడు. ఆగష్టు నెలలో సైకిల్ తొక్కుతూ బాబా రామ్‌దేవ్ జారిపడిపోగా అప్పుడు కూడా వైరల్ అయింది.

బాబా రామ్‌దేవ్ ఆసనాలకు, యోగా భంగిమలకు స్పెషల్. 2002 నుంచి అత్యధికంగా యోగా క్యాంపులు ఏర్పాటు చేసి టీవీ ఆడియెన్స్ ను బాగా ఆకర్షించారు. యోగా అనేది ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఇందులో ఫిజికల్ ఎక్సర్‌సైజులు, మానసిక ఏకాగ్రత, శ్వాసలో టెక్నిక్స్, కండరాలు బలపరచడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *