మహిళపై బాబా అత్యాచారం, పిల్లలు కలుగాలని తీసుకెళ్లిన అత్తింటి వారు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సంతానం కలుగాలని అత్తింటి వారు ఓ బాబా వద్దకు తీసుకెళితే..మహిళపై అత్యచారం జరిపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బాబాను, అత్త, భర్తను అరెస్టు చేశారు. భోపాల్ లోని అగర్ గ్రామంలో ఓ మహిళకు 2019, జూన్ లో వివాహం జరిగింది.
సంవత్సరం గడిచినా..గర్భం దాల్చలేదు. దీంతో 2020, జులై 08వ తేదీన ఓ బాబా వద్దకు భర్త తీసుకెళ్లాడు. బాబా చికిత్స చేస్తాడని, సంవత్సరం వరకు పుట్టింటింకి వెళ్లవద్దని అత్తింటి వారు చెప్పారని మహిళ వెల్లడించింది. తర్వాత..బాబా..గదిలోకి తీసుకెళ్లి..అత్యాచారం జరిపాడని బైర్సియా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అశ్లీల చిత్రాల కోసం రూ. 2 కోట్లు ఖర్చు చేశాడు.. అకౌంటెంట్ అరెస్ట్!


అత్యాచారం జరిపిన బాబా..కల్లు అలియాస్ కల్లా షాగా గుర్తించారు. బాబాను అరెస్టు చేశారు. వేధింపులు, కుట్రలపై అత్త, భర్తలను కూడా అరెస్టు చేసి జైలుకు తరలించారు. బెయిల్ ఇవ్వాలంటూ..court of Additional Session Judge Tripti Sharma ఎదుట బాబా పిటిషన్ దాఖలు చేశాడు. కానీ బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.


Related Posts