సోషల్ మీడియా పవర్, బాబా కా ధాబా ఎదుట ఫుల్ రష్, పెద్దాయన కన్నీళ్లు తుడిచారు.

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

BabaKaDhaba : సోషల్ మీడియా పవర్ ఏంటో మరోసారి నిరూపితమైంది. ఓ పెద్దాయన దీనావస్థల ఉన్న వీడియోకు ఫుల్ రెస్పాండ్ వచ్చింది. ఆ పెద్దాయన కన్నీళ్లు తుడిచారు. ఆయనకు సాయం చేయడానికి ఓ దండులా కదిలారు. దాబాకు వెళ్లి…అడిగింది తయారు చేయించుకుని తినేసి…డబ్బులు చెల్లించారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దాబాకు పునర్ వైభవం కల్పించేందుకు నెటిజన్లు సహాయ పడుతున్నారు. గిరాకీ రావడంతో..ఆయన ముఖంలో నవ్వులు విరిశాయి. సంతోషంతో కన్నీళ్లు వచ్చాయి.అసలు ఏంటీ విషయం
దక్షిణ ఢిల్లీలోని ఓ ప్రాంతంలో BabaKaDhaba పేరుతో కంతా ప్రసాద్.. అతని భార్య వృద్ధ దంపతులు చిన్న స్టాండ్ పెట్టుకుని ఫుడ్ విక్రయిస్తుంటారు. వీరు లాభం చూసుకోకుండా..వ్యాపారం చేస్తున్నారు. వండి పెట్టేంత సరుకులకు సరిపడా డబ్బులు ఉంటే సరిపోతుందని భావించేవారు. ఉదయం 6గంటల 30నిమిషాలకు వంట చేయడం మొదలుపెడతారు. 9 గంటల 30 నిమిషాలకల్లా రెడీ అయిపోతుంది.పప్పు, కూర, పరోటాలు, అన్నం, ఇలాంటి వంటలు కేవలం ప్లేట్ రూ.30-50వరకూ ఉంటుంది. ఇలా..30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారు. అయితే..కరోనా కారణంగా వీరి వ్యాపారం సరిగ్గా సాగలేదు. గిరాకీ రావడం తగ్గిపోయింది. ఓ వ్యక్తి అక్కడకు వచ్చి..ఎలా వ్యాపారం జరుగుతోంది ? అంటూ ప్రశ్నించాడు.


సారిగా ఆ వృద్ధుడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. క్యాష్ బాక్స్ లో నుంచి రూ.10 మాత్రమే తీసి చూపించాడు. నాలుగు గంటల్లో వాళ్లకు వచ్చింది కేవలం రూ.50మాత్రమే అంట. ఈ వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. Vasundhara Tankha Sharma వీడియోను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. వెళ్లి అక్కడ తిని..గిరాకీ కల్పించి..ఆ వృద్ధ దంపతులకు సహాయం చేయండి అంటూ ట్వీట్ చేశారు. క్షణాల్లో తెగ వైరల్ అయ్యింది.#BabaKaDhaba హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ లో ట్రెండింగ్ లో వచ్చిందంటే..ఎంతమంది వీడియోను చూశారో అర్థం చేసుకోవచ్చు. ప్రముఖులు సైతం స్పందించారు. అంతే..ఒక్కసారిగా.. Baba Ka Dhaba ఎదుట ఫుల్ రష్ కనిపించింది. సోషల్ మీడియా పవర్ అంటూ..కామెంట్స్ పెడుతున్నారు. వచ్చిన గిరాకీ చూసి..వృద్ధ దంపతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related Tags :

Related Posts :