Baby Buck Headbutts Leopard Persistently To Try Escape

వైరల్ వీడియో : చిరుతతో జింకపిల్ల పోరు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

బాగా బలిసిన చిరుత పులితో ఓ జింకపిల్ల పోరాడిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది.  పులి పంజా నుంచి తప్పించుకోవటానికి బలంగా ఉన్న జింక వాయు వేగంతో పరుగెడుతుంది.కాని చివరకు చిరుతకు ఆహారమైపోతుంది. కానీ ప్రాణాలతో బైటపడేందుకు పరుగును మాత్రం మానదు. అదే జింకలో ఉన్న ప్రత్యేకత. కానీ పోరాడితే పోయేదేముంది దక్కితే ప్రాణం తక్కుతుందని ఓ జింక పిల్ల ప్రయత్నించిన ఈ వీడియోను చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది. 

సౌత్ ఆఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్క్‌‌కు వెళ్లిన ఆండ్రూ ఫౌరీ అనే సఫారీ గైడ్‌కు ఈ విచిత్రమైన దృశ్యం కనిపించింది. న్యాలా అనే ఓ జంతువు పిల్ల (జింక జాతికి చెందినదే) పెద్ద చిరుతపులితో ఢీ కొట్టడం చూసిన ఫౌరీ టీం ఆశ్చర్యపోయింది.  

తమ కెమెరాలకు పనిపెట్టి అక్కడి దృశ్యాన్ని రికార్డ్ చేశారు. న్యాలా పిల్ల చిరుతపులి నుంచి తప్పించుకోలేక యుద్దం చేసింది. పెద్ద పెద్ద దెబ్బలు పులిని కొట్టేస్తున్నానని అనుకున్న ఆ కూన చేష్టలు పులికి చిరాకు తెప్పించాయి. హా….ఆఫ్ట్రాల్ ఈ పిల్లకుంకతో నాకేంటి పోరు అనుకుంది. పోవే చిట్టిదానా నువ్ నాముందు ఎంత? పెద్ద పెద్ద జంతువులే నా పంజా దెబ్బకు తాళలేక నాకు ఆహారం అయిపోయాయి అన్నట్లు ఆ చిరుత ఆ పిల్ల ఎన్ని దెబ్బలు కొడుతున్నా పట్టించుకోలేదు.

ఈ బుడ్డిదాన్ని తిందామంటే నాకు పెద్దగా ఆకలి కూడా వేయట్లేదు.. ఇదిచూస్తే పేద్ద వీరుడిలా ఫోజులు కొడుతూ నన్నే ఢీకొడుతోంది అనుకున్న  చిరుత పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఇంత పెద్దగా ఉన్న ఈ చిరుత నన్నేమీ చేయదులే అనుకుందేమో ఆ పిల్ల చిరుత వెంటే వెనుకే నడుచుకుంటూ వెళ్లడం చూస్తే జాలి కలుగుతుంది. అరె అది నిన్ను తినేస్తుంది పారిపోవే అని చెప్పాలనిపిస్తుంది. 

కానీ చివరకు ఏం జరుగుతుంది? పులి ఆ న్యాలా పిల్లను ప్రాణాలతో వదిలిపెడుతుందా? అని తెలుసుకుందామని ఫౌరీ టీం రెండు గంటల సేపు చిరుత..న్యాలా పిల్ల సీన్లను రికార్డింగ్ చేస్తూనే ఉన్నారు. చివరకు న్యాలా పిల్లను చిరుతపులి ఎలా పట్టుకుని తీసుకెళ్లిందో చూస్తే గుండె తరుక్కుపోతుంది. సహజంగా తాము వేటాడే దృశ్యాలను ఎక్కువగా చిత్రీకరించమని.. అయితే ఈ దృశ్యం తాము ఎన్నడూ చూడని విధంగా ఉండటంతో రికార్డ్ చేసినట్టు ఫౌరీ చెప్పాడు. బుజ్జిపిల్ల చేసిన ప్రయత్నానికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. చిరుతకు బలైపోతానని తెలిసి కూడా తన చిట్టి తలతో ఏదో చేద్దామని యత్నించింది. చివరకు.. చిరుతకు బలైపోయింది. 

READ  రంగారెడ్డిలో చిరుత: పశువులపై దాడిలో దూడ మృతి

Related Posts