లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఖననం చేస్తుండగా లేచి కూర్చున్న పసికందు

Published

on

Assam: రెండు నెలల బిడ్డ పరిస్థితి అర్థం కావడం లేదని హాస్పిటల్ కు తీసుకెళ్తే ప్రాణం పోయిందని చెప్పారు. విషాదంతో ఆ కుటుంబం అంత్యక్రియలు పూర్తి చేయబోతుండగా కళ్లు తెరిచింది. అస్సాంలోని దిబ్రుఘడ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఆదివారం మధ్యాహ్నం మట్టక్ టీ ఎస్టేట్ కు బిడ్డ ఆరోగ్యం బాలేదని తీసుకెళ్లేసరికి నర్సులు, డాక్టర్లు లేరు. గౌతం మిత్రా అనే కాంపౌండర్ మాత్రమే ఉండి బిడ్డ చనిపోయిందని డిక్లేర్ చేశాడు. ఇంటికి తీసుకొచ్చి ఆ చిన్నారికి అంత్యక్రియల ఏర్పాట్లు మొదలుపెట్టారు.ఆ రెండేళ్ల బాబు పేరెంట్స్ టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్నారు. అంత్యక్రియల కోసం చూస్తుండగా మహిళ తన ఒడిలో ఉన్న బిడ్డ కదులుతుండటం గమనించింది. వెంటనే ఆ బిడ్డను గార్డెన్ హాస్పిటల్ కు తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం బాబుని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. చనిపోయాడంటూ కాంపౌండర్ డిక్లేర్ చేసిన హాస్పిటల్‌కే తీసుకెళ్లారు.

ఈ ఘటనతో సోమవారం గార్డెన్ హాస్పిటల్ చుట్టూ 12వందల మంది వర్కర్స్ పోగై ఆందోళన చేపట్టారు. అందులో కొందరు లాహోవల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడానికి వెళ్లారు. ఆందోళన తర్వాత పోలీసులు కాంపౌండర్ మిత్రాను అరెస్టు చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *