కరోనా నెగెటివ్ తో ఇంటికి చేరుకున్న బిగ్-బీ, హాస్పిటల్లోనే అభిషేక్ బచ్చన్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

యాక్టర్ అమితాబ్ బచ్చన్ ముంబై నానావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 23రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న బిగ్ బీ ఆదివారం ఇంటికి చేరుకున్నారు. 77సంవత్సరాల జులై 11న తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అదే సమయంలో ఇంట్లో వారు టెస్టులు చేయించుకోవడంతో కొడుకు అభిషేక్ బచ్చన్ కు కూడా పాజిటివ్ వచ్చింది. ఇద్దరూ ఒకే హాస్పిటల్లో అడ్మిట్ అయి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నప్పటికీ బిగ్ బీ త్వరగా కోలుకున్నారు.

ప్రస్తుతం ఆయన ఇంటికి వెళ్లినప్పటికీ సొలిటరీ క్వారంటైన్ లో ఉండనున్నట్లు సూచించారు. లేటెస్ట్ ట్వీట్ లో ఆయన.. ‘నాకు చేసిన టెస్టులో కరోనా నెగెటివ్ అని వచ్చింది. నేను ఇంటికి తిరిగి వచ్చాను. కానీ క్వారంటైన్ లో ఉన్నాను. అంతా ఆ దేవుడి దయ. మా తల్లీదండ్రుల ఆశీస్సులు, స్నేహితుల ఆశీర్వాదాలతోనే ఇది సాధ్యమైంది. అభిమానుల సపోర్ట్ తోనే. నానావతి హాస్పిటల్ ఎక్సిలెంట్ కేర్ తీసుకుంది. నేను ఈరోజు ఇలా ఉండటానికి కారణం వాళ్లే’ అని ట్వీట్ చేశారు.

అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేయడానికి కొద్ది నిమిషాల ముందు అభిషేక్ తన తండ్రి గురించి ట్వీట్ చేశారు. తన తండ్రి రిపోర్ట్స్ లో కరోనా నెగెటివ్ వచ్చిందని.. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని అందులో పేర్కొన్నారు. ఇప్పుడు ఇంట్లో రెస్ట్ గా ఉంటారు. ఆయన గురించి చేసిన ప్రార్థనలకు కోర్కెలకు మీ అందరికీ థ్యాంక్స్ అని పోస్టు చేశారు.

 

రెండో ట్వీట్ లో దురదృష్టవశాత్తు.. కొన్ని కారణాల కారణంగా నేను ఇంకా కొవిడ్ పాజిటివ్ గానే ఉన్నాను. అందుకే హాస్పిటల్ లో ఉండాల్సి వచ్చింది. మా కుటుంబం కోసం మీ కోర్కెలు, ప్రార్థనలకు థ్యాంక్యూ. నేను హెల్తీగా తిరిగి వస్తానని ప్రామిస్ చేస్తున్నా అంటూ అభిషేక్ మరో ట్వీట్ లో పేర్కొన్నారు.

READ  బాలసుబ్రహ్మణ్యం భార్యకూ కరోనా పాజిటివ్‌..

Related Posts