లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

BB3 క్రేజ్.. నాన్ థియేట్రికల్ బిజినెస్ పూర్తి!

Published

on

Balayya – Boyapati: నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కనున్న హ్యాట్రిక్ ఫిల్మ్.. BB3(వర్కింగ్ టైటిల్)..ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా వాయిదా పడింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన #BB3 First Roar వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాలో కథానాయికగా మలయాళీ ముద్దుగుమ్మ Pragaya Martin, మెయిన్ విలన్‌గా Sonu Sood ఫిక్స్ అయ్యారని వార్తలు వచ్చాయి కానీ మూవీ టీం అధికారికంగా ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమా శాటిలైట్, డిజిటల్ రైట్స్‌కు సంబంధించిన డీల్ పూర్తయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి.

BB3 శాటిలైట్ హక్కులను ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్ జెమిని టివి రూ. 11.5 కోట్లకు సొంతం చేసుకుందట. అలాగే రూ. 9 కోట్లకు డిజిటల్ రైట్స్ అమ్ముడయ్యాయని టాక్. ఈ లెక్కన రూ. 20.5 కోట్లకు నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం..
Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *