లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

గ్రేటర్‌లో అనూహ్యం ఫలితాల తర్వాత కేసీఆర్‌పై ప్రత్యక్ష విమర్శలకు దిగిన బండి సంజయ్

Published

on

Bandi Sanjay: గ్రేటర్ ఫలితాలపై అనూహ్య ఫలితాలు వచ్చాయని, కేంద్ర మంత్రులు, జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాలు వచ్చి ప్రచారం చేసి మాకు మద్ధతు ఇచ్చారు. ఈ పార్టీ విజయం కార్యకర్తలది. అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. అంతేకాకుండా పార్టీ విజయాన్ని ఎన్నికల కమిషనర్, డీజీపీకి అంకితం ఇస్తున్నట్లు సెటైరికల్ గా చెప్పారు.

ఇలా ప్రసంగాన్ని కొనసాగించిన బండి సంజయ్.. ‘కేసీఆర్ ను భాగ్యనగర ప్రజలను తిరస్కరించారు. టీఆర్ఎస్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. బీజేపీ కార్యకర్తలపైన దాడులను ప్రభుత్వం పట్టించుకోలేదు. భాగ్యలక్ష్మీ అమ్మవారి దయతోనే విజయం సాధ్యమైంది. అభివృద్ధి, ఆత్మ గౌరవం కోసం పోరాడిన మా పార్టీకే ప్రజలు మొగ్గు చూపారు’‘రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటికైనా బయటకు రావాలి. వాళ్ల ఎమ్మెల్యేలకు, ఎంపీలకైనా అపాయింట్మెంట్ లు ఇవ్వాలి. కార్యకర్తల కృషి వల్ల గ్రేటర్ విజయం సాధ్యమైంది. అహంకారం రహితంగా పేద ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసిన ఆశయాల కోసం, ఉద్యమకారుల లక్ష్యాల కోసం పని చేస్తాం. భారతీయ జనతా పార్టీని ఆదరించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇవే ఫలితాలు కొనసాగిస్తూ.. హామీ ఇస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు,.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *