లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్‌ అనుచిత వ్యాఖ్యలు…రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు

Published

on

trs complaint on Bandi Sanjay : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని.. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్ సెక్రటరీ భరత్ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. చట్ట ప్రకారం ఎంపీ బండి సంజయ్‌పై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు కోరారు.వాస్తవాలను పక్కనపెట్టి అసత్య ప్రచారాలు చేస్తూ, అబద్ధాలు మాట్లాడుతున్నారని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులపై అసభ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. అవమానపరిచే విధంగా వ్యాఖ్యానిస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని పేర్కొన్నారు. బండి సంజయ్ వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరమన్నారు.సోషల్ మీడియా, ట్విట్టర్ లో కావాలని తప్పుడు ప్రచారం చేస్తూ, అబండాలు వేస్తూ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలని ఈసీకి రిప్రజెంటేషన్ ఇచ్చినట్లు తెలిపారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *