లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

37 దేశాల్ని అవలీలగా చుట్టొచ్చిన ఫేమస్ బైకర్..ఒంటెను ఢీకొని మృతి

Published

on

Bangalore Famous biker King Richard Srinivasan died : అతనో బెంగళూరుకు చెందిన స్టార్ బైకర్..భారత్ కు చెందిన సెలబ్రిటీ బైకర్లలో అగ్రగణ్యుడు. అతను ఏ బైక్ కైనా కిక్ కొట్టి గేరు మార్చాడంటే..కళ్లు మూసి తెరిచేలోగా వంద కిలోమీటర్లు దూసుకుపోగల స్టార్ బైకర్. 5 ఖండాల్లో 37 ఏడు దేశాల్ని బైక్ మీద అవలీలగా చుట్టి వచ్చేసిన గొప్ప బైకర్. అటువంటి ఓ స్టార్ బైకర్ ఓ ఒంటెను ఢీకొని దుర్మరణం పాలయిన ఘటన విషాదాన్ని కలిగించింది. బుధవారం (జనవరి 13,2021) రాత్రి ఓ ఒంటెను ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు భారత సెలబ్రిటీ బైకర్లలో ఒకరైన కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్.

బెంగళూరుకు చెందిన ఈ స్టార్ బైకర్ మోటార్ సైకిల్ పై 5 ఖండాల్లో 37 దేశాల్ని అవలీలగా చుట్టొచ్చాడు. బైక్ పై 65 వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రత్యేక గుర్తింపు పొందాడు. తాజాగా..బెంగళూరు నుంచి 8 వేల కిలోమీటర్ల యాత్రలో భాగంగా బీఎండబ్ల్యూ జీఎస్ బైక్ పై ముగ్గురు ఫ్రెండ్స్ తో కలిసి జైసల్మేర్ చేరుకున్నాడు.

ఈక్రమంలో ఫతేగఢ్ ప్రాంతంలో రోడ్డుపైకి అకస్మాత్తుగా ఓ ఒంటె రావడంతో శ్రీనివాసన్ తన బైకును కంట్రోల్ చేయలేకపోయాడు. బైక్ పై ఫాస్టుగా రావటంతో ఒంటెను ఢీకొట్టి రోడ్డుపై పడిపోయాడు. దీంతో రిచర్డ్ తలకు బలమైన దెబ్బలు తగలడంతో మృతి చెందాడు.

ఫ్రెండ్స్ తో కలిసి యాత్రకు బయలుదేరిన శ్రీనివాసన్ జనవరి 23న తిరిగి బెంగళూరు చేరుకోవాల్సి ఉంది. కానీ..దురదృష్టవశాత్తు ప్రమాదం జరగటంతో దుర్మరణం పాలయ్యాడు. శ్రీనివాస్ కు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.

శ్రీనివాసన్ 2018లో బెంగళూరు నుంచి లండన్ కు బైక్ యాత్ర చేశాడు. ఆ మరుసటి ఏడాది దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాల్లో యాత్ర సాగించి విజయవంతంగా తిరిగి వచ్చాడు. కానీ రోజులన్నీ మనవి కావన్నట్లుగా అదే బైక్ యాత్రలో ప్రాణాలు కోల్పోయాడు.